'తండేల్' నమో నమః శివాయ ఎప్పుడంటే..!
రేపు విడుదల కాబోతున్న పాట ప్రోమోలో సాయి పల్లవి డాన్స్ అదిరి పోయింది. ఆమె లుక్ మాత్రమే కాకుండా పాట మేకింగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'తండేల్' సినిమా వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఫిబ్రవరి 7వ తారీకు విడుదల కాబోతున్న తండేల్ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పాట ప్రేక్షకులను అలరిస్తుంది. ఆ పాటకు మంచి స్పందన రావడంతో రెండో పాటను వెంటనే విడుదల చేయాలని భావించినా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు తండేల్ నుంచి రెండో పాటకు ముహూర్తం ఖరారు అయ్యింది. జనవరి 4వ తారీఖు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు నమో నమః శివా అంటూ సాగే పాట రాబోతుంది. పాట ప్రోమోను విడుదల చేసి అంచనాలు భారీగా పెంచారు.
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తండేల్ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాసు ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని దర్శకుడు చందు మొండేటి తీవ్రంగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అల్లు అరవింద్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినిమా విడుదలకు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉండటంతో మెల్ల మెల్లగా ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేస్తున్నారు.
ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి పాట బుజ్జి తల్లికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. పైగా సాయి పల్లవి గతంలో నాగ చైతన్యతో కలిసి నటించిన లవ్ స్టోరీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా తర్వాత మళ్లీ వీరి కాంబోలో రాబోతున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న తండేల్ సినిమా నుంచి రెండో పాట రాబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. రేపు విడుదల కాబోతున్న పాట ప్రోమోలో సాయి పల్లవి డాన్స్ అదిరి పోయింది. ఆమె లుక్ మాత్రమే కాకుండా పాట మేకింగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సాయి పల్లవి ఇటీవల అమరన్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక మంచి జోరు మీద ఉన్న సాయి పల్లవి నటించిన సినిమా కావడంతో తండేల్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. తండేల్ సినిమాను తెలుగులో భారీ ఎత్తున ఫిబ్రవరి 7న విడుదల చేయబోతున్నారు. తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే ఇతర భాషల్లోనూ సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా ఈ సినిమా నిలుస్తుందని, నాగ చైతన్యకి ఈ సినిమా హిట్‌ను కట్టబెడుతుంది అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.