హీరో గారి పెళ్లి వార్తల పై క్లారిటీ
అంతే కాకుండా తాను ఒకవేళ పెళ్లికి సిద్ధం అయితే తప్పకుండా మీడియా ద్వారా అందరికి తెలియజేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.
బాల నటుడిగా పదేళ్ల పాటు పదుల సంఖ్యలో సినిమాలు చేసిన తరుణ్ 2000 సంవత్సరం లో హీరోగా నువ్వే కావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకుని కెరీర్ ఆరంభం లోనే స్టార్ హీరోల కు పోటీ అన్నట్లుగా నిలిచాడు.
సీనియర్ నటి రోజా రమణి కుమారుడు అయిన తరుణ్ పెళ్లి గురించి మీడియా లో రెగ్యులర్ గా వార్తలు వస్తూనే ఉన్నాయి. తరుణ్ కొన్నాళ్లుగా సినిమాల కు దూరంగా ఉంటూ తన పనులు తాను చేసుకుంటున్నాడు. ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంటున్నా కూడా మీడియాలో పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి.
ఇటీవల తరుణ్ పెళ్లి గురించి ఇంకాస్త ఎక్కువ అన్నట్లుగా ప్రచారం జరిగింది. తరుణ్ పెళ్లి ఫిక్స్ అయింది.. అమ్మాయి పలానా అంటూ రకరకాలుగా ప్రచారం జరిగింది. దాంతో తరుణ్ టీమ్ నుండి అధికారికంగా క్లారిటీ వచ్చింది. స్వయంగా తరుణ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా స్పందించాడు.
సోషల్ మీడియా ద్వారా తరుణ్ స్పందిస్తూ... పెళ్లి వార్తలు నిజం కాదని తేల్చి చెప్పాడు. అంతే కాకుండా తాను ఒకవేళ పెళ్లికి సిద్ధం అయితే తప్పకుండా మీడియా ద్వారా అందరికి తెలియజేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. తన పెళ్లి గురించి ఎందుకు ఇంతగా ప్రచారం జరుగుతుందో అర్థం కావడం లేదు అంటూ తరుణ్ అసహనం వ్యక్తం చేశాడు. ఇకపై అయినా తరుణ్ పెళ్లి వార్తల కు బ్రేక్ వచ్చేనా కూడాలి.