ప్రభాస్ సినిమాలో ఆ బోల్డ్ పాప..

ఇక ఒక్క మంచి సక్సెస్ పడితే మాత్రం ఏకంగా ఫ్యాన్ ఇండియా హీరోలతో అవకాశాలు అందుకునే లక్కు కూడా ఉంటుంది.

Update: 2023-12-06 11:54 GMT

కొత్తగా వచ్చే హీరోయిన్స్ కు ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు మెండుగా ఉంటాయి. గ్లామర్ కు తోడు కాస్త టాలెంట్ తో మెప్పిస్తే చాలు చాలా వేగంగా అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇక ఒక్క మంచి సక్సెస్ పడితే మాత్రం ఏకంగా ఫ్యాన్ ఇండియా హీరోలతో అవకాశాలు అందుకునే లక్కు కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రభాస్ లాంటి హీరోలకు కూడా హీరోయిన్స్ దొరకడం కాస్త కష్టంగానే మారింది.


ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోయిన్స్ రొటీన్ అయిపోయారు అనే కారణం చేత దర్శక నిర్మాతలు పెద్దగా వారి వైపు చూడడం లేదు. ఇక ఇదివరకే కొంతమంది ఫామ్ లో ఉన్న బ్యూటీలతో ప్రభాస్ సినిమాలు చేసేసాడు. ఇక రాబోయే భవిష్యత్తు ప్రాజెక్టుల కు హీరోయిన్స్ ను సెలెక్ట్ చేయడం పెద్ద టాస్క్ గా మారింది.

ఇక ప్రభాస్ ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు అలాగే ప్రాజెక్టు K కల్కి సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. ఈ రెండు సినిమాలలో హీరోయిన్స్ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇంకా హీరోయిన్స్ పిక్స్ కానీ ప్రాజెక్టులో ఉన్నాయి. అందులో హను రాఘవపూడి ప్రాజెక్టు తోపాటు సందీప్ రెడ్డి స్పిరిట్ కూడా ఉంది.

ఇక హను సినిమాపై అఫీషియల్ గా క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ స్పిరిట్ ను మాత్రం ఏడాది క్రితమే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాలో దర్శకుడు సందీప్ రెడ్డివంగా ఒక హీరోయిన్ను సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు. త్రిప్తి దిమ్రీ అని తెలుస్తోంది. అమ్మడు యానిమల్ సినిమాలో జోయా అనే క్యారెక్టర్ లో కనిపించిన విషయం తెలిసిందే.

త్రిప్తి దిమ్రీ, రణబీర్ కపూర్ తో రొమాంటిక్ సన్నివేశాలలో నటించిన విధానం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక తన క్యూట్ గ్లామర్ తో సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది. అయితే ఈ బ్యూటీని స్పిరిట్ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర కోసం సందీప్ రెడ్డి ఎంచుకునే అవకాశం ఉన్నట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది. కానీ మెయిన్ హీరోయిన్ మాత్రం మరొకరు అని కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఒకవేళ అమ్మడికి నిజంగానే అవకాశం వస్తే మాత్రం కెరియర్ కు చాలా ప్లస్ అవుతుంది. ఇక ప్రస్తుతం అయితే త్రిప్తి దిమ్రీ బాలీవుడ్ లోనే రెండు సినిమాలు చేస్తోంది.

Tags:    

Similar News