నా పేరుతో ఆ అంకుల్ డబ్బులు సంపాదిస్తున్నారు

కొంతమంది సీనియర్ జర్నలిస్టులు, అనుభవశాలి అన్న అర్హతతో నటీనటులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు ఇచ్చే వాళ్లపై రేణు దేశాయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Update: 2023-12-08 11:46 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రీసెంట్ గా 'టైగర్ నాగేశ్వరరావు' మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. రవితేజ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో హేమలత లవణం అనే పాత్రలో నటించి ఆకట్టుకుంది రేణు దేశాయ్. ఇదిలా ఉంటే తాజాగా రేణు దేశాయ్ తన సోషల్ మీడియాలో పెట్టిన సుదీర్ఘ పోస్ట్ వైరల్ గా మారింది. కొంతమంది సీనియర్ జర్నలిస్టులు, అనుభవశాలి అన్న అర్హతతో నటీనటులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు ఇచ్చే వాళ్లపై రేణు దేశాయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఓ సీనియర్ జర్నలిస్ట్ తన వ్యక్తిగత విషయాల గురించి చిన్న చూపు చేసి మాట్లాడిన కొన్ని వీడియో క్లిప్స్ ని ఈ సందర్భంగా షేర్ చేసింది. మహిళలంటే ఎంత చిన్నచూపు అనే విషయాన్ని రేణు దేశాయ్ చెప్పింది. పవన్ కళ్యాణ్ నామస్మరణం, అకిరానందన్ ని తెరపైకి తీసుకురావడం తప్ప ఏం చేసినా ఆమెను జనాలు పెద్దగా పట్టించుకోరు అన్నట్టుగా సదరు జర్నలిస్టు మాట్లాడటంతో అతనికి రేణు దేశాయ్ తన స్టైల్లో కౌంటర్ వేసింది.

ఈ సందర్భంగా తాను సింగిల్ ఉమెన్ గా సాధించిన విజయాలను గుర్తు చేసింది. ఎన్నో రకాల యాడ్స్ చేయడం, సినిమాలు చేయడం, రైటర్ గా, ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా, ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనడం, కాస్ట్యూమ్ డిజైనర్.. ఇలా ఎన్నో రంగాల్లో మహిళగా తను సాధించిన విజయాల గురించి చెప్పుకొచ్చింది. 'తన పేరును వాడుకొని వీడియోలు చేస్తూ యూట్యూబ్లో మాట్లాడుతూ ఈ అంకుల్ డబ్బులు సంపాదించుకుంటున్నాడు' అంటూ రేణు దేశాయ్ అతనిపై కౌంటర్స్ వేసింది.

ఆయన ఎవరో నాకు తెలియదు? నేను అతన్ని ఎప్పుడు కలవలేదు. అంకుల్ మీ అనుభవం ఇలా ఉందంటే జాలి వేస్తుంది? అంటూ రేణు దేశాయ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. అంతేకాకుండా.. సినిమాల్లో ఆడవారి మీద చూపించే వివక్ష ఇలాంటి మగవాళ్ళు ఇంకా అలాంటివే నమ్ముతూ ఆడవాళ్లు దేనికి పనికిరారు అనే భావనని చెరిపేయాలి. మనం ఆ దిశగా అడుగులు వేయాలి. తండ్రి, భర్త, కొడుకులు ఇలా వారికి మాత్రమే గుర్తింపు ఉంటుందని, మనలాంటి ఆడవాళ్లకు ఎలాంటి గుర్తింపు ఉండదు అని నమ్మే ఇలాంటి వాళ్ళ మీద దృష్టి పెట్టాలి.

ఇతను నామీద మాట్లాడాడు కదా! అని పెడుతున్న పోస్ట్ కాదు. నేను ఇలాంటి వాటిని పట్టించుకోవడం మానేశా. ఈ వీడియోలు చూస్తుంటే పురుషాధిక్యత ఎంతలా ఉందో, అహంకారం ఎంత ఉందో కనిపిస్తోంది. ఇంకా ఈ సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాటిపై చర్చలు జరగాలి. ఇది నా మాజీ భర్త గురించి వేస్తున్న పోస్ట్ కూడా కాదు. భవిష్యత్తు తరంలోని స్త్రీలు, కూతుళ్లు, మనవరాళ్ల గురించి పెడుతున్న పోస్ట్" అంటూ రేణు దేశాయ్ తన సుదీర్ఘ పోస్టులో రాస్కొచ్చింది.

Tags:    

Similar News