డార్లింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. రాజా సాబ్ వచ్చేస్తున్నాడు!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "ది రాజా సాబ్".

Update: 2024-10-21 08:27 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "ది రాజా సాబ్". ఇది రొమాంటిక్ హారర్ కామెడీ మూవీ. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ఫ్యాన్ ఇండియన్ గ్లింప్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రభాస్ సరికొత్త లుక్ లో కనిపించి అభిమానులను ఉత్సాహ పరిచారు. డార్లింగ్ పుట్టినరోజు దగ్గరలోనే ఉండటంతో, ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ నుంచి ఓ క్రేజీ న్యూస్ వచ్చింది.

అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్ డే కానుకగా, ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ 'ది రాజా సాబ్' స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేయాలని టీమ్ నిర్ణయించుకున్నారు. ఈ రోజు సోమవారం సాయంత్రం 4:05 గంటలకు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ''మాన్‌స్టర్‌.. డార్లింగ్ మ్యాసివ్ గా కనిపిస్తున్నాడు'' అని మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.థమన్ పేర్కొన్నారు. 'మొత్తం షేక్ షేక్ అని కవి భావం' అని చిత్ర బృందం అంటూ ఫ్యాన్స్ లో అంచనాలను రెట్టింపు చేసింది. ఇక ఈ పోస్టర్లో గళ్ళ కోటు, టీ షర్ట్, నల్ల ఫ్యాంటు ధరించి ప్రభాస్ స్టైలిష్ గా కనిపించనున్నారని సమాచారం.

ప్రభాస్ తన కెరీర్ లోనే తొలిసారిగా చేస్తున్న రొమాంటిక్ హారర్ కామెడీ 'ది రాజా సాబ్'. ఇది కింగ్ సైజ్ ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుందని మేకర్స్ చెబుతూ వస్తున్నారు. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్లు నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, యోగిబాబు, జిషు షేన్ గుప్తా, మురళీ శర్మ, రాజీవ్ కనకాల తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

'ది రాజా సాబ్' చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 2025 ఏప్రిల్ 10న పాన్ ఇండియా వైడ్ గా తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

'సలార్', 'కల్కి 2898 ఏడీ' వంటి బ్యాక్ టూ బ్యాక్ భారీ బ్లాక్‌ బస్టర్‌ హిట్ సినిమాల తర్వాత ప్రభాస్‌ నుంచి రాబోతున్న చిత్రం కావడంతో.. ''ది రాజా సాబ్'' పై ట్రేడ్ లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. నాన్ థియేట్రికల్ రైట్స్ కు ఇప్పటి నుంచే భారీ డిమాండ్ ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ఆడియో హక్కులను టీ-సిరీస్ సంస్థ 25 కోట్ల రూపాయలకు తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ పుట్టినరోజు నుంచి ప్రమోషన్స్ ప్రారంభించి, రిలీజ్ వరకూ అందరినీ రాజాసాబ్‌ ప్రపంచంలోకి తీసుకెళ్తామని మేకర్స్ చెబుతున్నారు.

Tags:    

Similar News