ఇది! రాజా సాబ్ అసలు సర్ ప్రైజ్
తెలుగు చిత్ర పరిశ్రమలోని హీరోలు అందరూ ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు.
తెలుగు చిత్ర పరిశ్రమలోని హీరోలు అందరూ ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. ముఖ్యంగా కొందరు పాన్ ఇండియా రేంజ్ హీరోలు డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. అలాంటి వారిలో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. నేషనల్ స్టార్‌గా మారిన తర్వాత మరింత దూకుడుగా వెళ్తోన్న అతడు.. ఏకకాలంగా నాలుగైదు ప్రాజెక్టులను చేస్తూ షాక్ ఇచ్చేస్తున్నాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు నటిస్తోన్న చిత్రాల్లో ‘ది రాజా సాబ్’ ఒకటి. ఇప్పటి వరకూ చిన్న చిత్రాలనే చేసిన దర్శకుడు మారుతి ఈ మూవీని తీస్తున్నారు. దీంతో ఈ ఫిల్మ్ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు తగ్గట్లుగానే దీన్ని ప్రభాస్ గతంలో ఎన్నడూ టచ్ చేయని హర్రర్ కామెడీ జోనర్‌లో రూపొందిస్తోన్నారు. దీంతో ఈ చిత్రం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
‘ది రాజా సాబ్’ సినిమా నుంచి తరచూ అప్‌డేట్లు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం నుంచి ఎన్నో రకాల పోస్టర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని అక్టోబర్ 23వ తేదీన ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్‌ను వదిలారు. ఇందులో రెబెల్ స్టార్ ఎవరూ ఊహించని గెటప్‌తో దర్శనం ఇచ్చాడు. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే ఫుల్ వైరల్ అయిపోయింది.
మారుతి దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘ది రాజా సాబ్’ సినిమా నుంచి ఇప్పటికే ఎన్నో అంశాలు లీక్ అయ్యాయి. ముఖ్యంగా ఇందులో అతడు డ్యూయల్ రోల్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఇందులో ప్రభాస్ పాత్రలు రెండే అయినా.. మూడు రూపాల్లో కనిపిస్తాడట.
‘ది రాజా సాబ్’ సినిమాలో ప్రభాస్ వృద్ధుడిగా ఓ పాత్రను చేస్తున్నట్లు తాజాగా వచ్చిన మోషన్ పోస్టర్ ద్వారా తెలిసింది. దీనితో పాటు అతడి మనవడి రోల్ కూడా చేస్తున్నాడట. ఈ రెండు మాత్రమే కాకుండా ఆత్మగా రెబెల్ స్టార్ మరో పాత్రను కూడా చేస్తున్నాడని తాజాగా మరో న్యూస్ బయటకు వచ్చింది. అంటే.. ఇందులో ప్రభాస్ మూడు భిన్నమైన గెటప్‌లతో దర్శనం ఇవ్వబోతున్నాడన్న మాట. అయితే, మూడు గెటప్‌లు ఉన్నా అతడు చేసేది రెండు పాత్రలే అన్న టాక్ కూడా ఒకటి వినిపిస్తోంది. ఏది ఏమైనా ‘ది రాజా సాబ్’ నుంచి వచ్చిన ఈ వార్త డార్లింగ్ ఫ్యాన్స్‌కు నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.