ఓటీటీలో మన లేడీ ఓరియెంటెడ్ చిత్రాల హవా

ఓటీటీ ల్లో ప్రేక్షకులు కేవలం కొత్త సినిమాలను మాత్రమే కాకుండా పాత సినిమాలు, క్లాసిక్ సినిమాలను కూడా తెగ చూస్తున్నారట.

Update: 2023-11-25 15:30 GMT

ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు వినోదం కోసం థియేటర్‌ లు, టీవీల కంటే ఎక్కువగా ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు అనడంలో సందేహం లేదు. పలు ఆన్‌ లైన్ మీడియా సంస్థలు చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడి అయింది. ఓటీటీ ల్లో ప్రేక్షకులు కేవలం కొత్త సినిమాలను మాత్రమే కాకుండా పాత సినిమాలు, క్లాసిక్ సినిమాలను కూడా తెగ చూస్తున్నారట.

సౌత్‌ ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు ఓటీటీ లో మంచి స్పందన ఉంది. కేవలం ఆయా భాషల్లో మాత్రమే కాకుండా ఇతర భాషల ప్రేక్షకులు కూడా సబ్ టైటిల్స్ తో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని సినిమాలకు డబ్బింగ్ చేయగా, కొన్ని సినిమాలకు సబ్ టైటిల్స్ ను ఇవ్వడం జరిగింది. దాంతో అన్ని భాషల ప్రేక్షకులు మన లేడీ ఓరియంటెడ్ పాత సినిమాలను ఓటీటీ లో తెగ చూస్తున్నారట.

ఓటీటీల్లో అత్యధికంగా చూస్తున్న మన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఇవే...

అరుంధతి : అనుష్క హీరోయిన్‌ గా నటించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. గ్రాఫిక్స్ పెద్దగా అందుబాటులో లేని రోజుల్లో అద్భుతమైన విజువల్ వండర్ గా ఈ సినిమా ను దర్శకుడు రూపొందించాడు. కథ మరియు కథనం అన్ని కూడా అద్భుతంగా ఉండటంతో అప్పట్లోనే రికార్డ్‌ స్థాయి కలెక్షన్స్‌ నమోదు చేసింది. అరుంధతి వచ్చి 15 ఏళ్లు అయినా కూడా ఇంకా ఓటీటీ లో సందడి చేస్తూనే ఉంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ లో ఈ సినిమాను ప్రేక్షకులు స్ట్రీమింగ్‌ చేస్తున్నారు.

మహానటి : కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మహానటి సావిత్రి బయోపిక్ అనే విషయం తెల్సిందే. సావిత్రి నిజ జీవిత చరిత్ర కు కాస్త కమర్షియల్‌ ఎలిమెంట్స్ జోడించడం ద్వారా దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. విడుదల అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అమెజాన్‌ ప్రైమ్‌ లో ఈ సినిమా మంచి వ్యూస్ ను దక్కించుకుంటూనే ఉంది.

యశోద : సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మహిళల సమస్యల గురించి చూపించడం జరిగింది. సినిమాలో సమంత నటన అద్భుతం అనడంలో సందేహం లేదు. కమర్షియల్‌ గా సినిమా నిరాశ పరిచినా కూడా ఓటీటీ లో మాత్రం భారీగా స్పందన దక్కించుకుంది. అమెజాన్ ప్రైమ్‌ లో ఎక్కువ మంది ఇంకా చూస్తూనే ఉన్నారట.

కర్తవ్యం : లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నటించిన ఆరమ్‌ కి తెలుగు డబ్బింగ్ ఇది. అమెజాన్‌ ప్రైమ్ లో తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఎక్కువగా చూస్తున్నారు. ఈ సినిమాలను హిందీతో పాటు ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఆయా ఓటీటీ ల్లో అత్యధికంగా చూస్తున్నట్లుగా ఆన్ లైన్ సర్వేలో వెల్లడి అయింది.


Tags:    

Similar News