మార్వెల్ యూనివర్శ్ పైనే అతి పెద్ద మచ్చ!
ఎన్ని యూనివర్శల్స్ ఉన్నా ఎమ్ సీయూ అన్నది ప్రేక్షకుల్లో ఓ బ్రాండ్ గా కొన్నేళ్ల క్రితమే ఓ ముద్ర పడిపోయిం ది.
వరల్డ్ వైడ్ మార్వెల్ యూనివర్శ్ అంటే ఓ బ్రాండ్. ఎమ్ సీ. యూ నుంచి సినిమా వస్తుందంటే ప్రపంచ మంతా ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తుంది. హాలీవుడ్ లో మార్వెల్ కి ఉన్న ప్రత్యేతక అది. ఎన్ని యూనివర్శల్స్ ఉన్నా ఎమ్ సీయూ అన్నది ప్రేక్షకుల్లో ఓ బ్రాండ్ గా కొన్నేళ్ల క్రితమే ఓ ముద్ర పడిపోయిం ది. ఆ బ్రాండ్ తోనే మార్వెల్ ఇప్పటివకరూ దిగ్విజయంగా 32 సినిమాలు రిలీజ్ చేసింది.
అయితే తాజాగా రిలీజ్ అయిన ది మార్వెల్స్ మాత్రం మొత్తం ఎమ్ సీ యూకే మచ్చ తెచ్చినట్లు అయింది. భారీ అంచనాల మధ్య నవంబర్ 7న రిలీజ్ అయిన సినిమా తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది. ఇప్పటి వరకూ మార్వెల్ లోని ఏ సినిమాకి రానంత వ్యతిరేకత ది మార్వెల్స్ సొంతం చేసుకుంది. 105 నిమిషాల గల సినిమా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిందంటున్నారు.
ఇలాంటి సినిమాలు తీయడం కన్నా మార్వెల్ పరువు నిలబెట్టడం కోసం ఇక్కడితో ఎమ్. సీ.యూని ఆపేస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో నెటి జనులు పోస్టులు పెడుతున్నారు. ఎమ్. సీ. యూ నుంచి ఇప్పటివరకూ ఎన్నో కొత్త పాత్రల్ని తె రపై ఆవిష్కరించారు. ఒక్కో సినిమాకి ఒక్కో ప్రత్యేకత కనిపించింది. కొత్త పాత్రలు..పాత్రల్ని ఎంతో వైవిథ్యంగా మలిచారు. కానీ 33వ ది మార్వెల్స్ లో మాత్రం అన్ని మిక్సింగ్ చేసిట్లు ఉందని.క్రియేటివ్ గా రాయలేనప్పడు అపడం మంచిదని సలహాలిస్తున్నారు.
అలాగే హాలీవుడ్ మీడియా కూడా సినిమాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. న్యాయార్క్ టైమ్స్ ఇప్పటికే 32 సార్లు చూసాం. 33వ సారి కూడా అదే చూపించారని రాసుకొచ్చింది. 32వ సినిమా కథ..కథనాలే 33 లోనూ ఉన్నాయని అభిప్రాయపడింది. ఇక వాష్టింగ్ టన్ పోస్ట్ నవ్వులు..సస్పెన్స్ లేని ఈ సినిమా ఎలా చూడాలి? అని విమర్శించింది. ఇంకా దిహాలీవుడ్ రిపోర్టర్.. ది టెలిగ్రాఫ్ ..ది వ్రాప్ ..అసోసియేటెడ్ ప్రెస్.. యూఎస్ ఏ టుడే.. న్యాయార్క్ పోస్ట్ లాంటి ప్రఖ్యాత మీడియా సంస్థలు మార్వెల్స్ ని చెడుగుడు ఆడేసాయి.