27 ఏళ్ల త‌ర్వాత ఆ సినిమాకి సీక్వెల్!

ద‌శాబ్ధాల క్రితం నాటి కంటెంట్ ని సైతం తవ్వి తీసి సీక్వెల్స్ చేయ‌డం అక్క‌డో స్టైల్.

Update: 2024-06-14 07:48 GMT

బాలీవుడ్ లో సీక్వెల్ ప‌రంప‌ర గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. హిట్ సినిమా ప్రాంచైజీకి ఎన్ని సీక్వెల్స్ అయినా వ‌స్తుంటాయి. ద‌శాబ్ధాల క్రితం నాటి కంటెంట్ ని సైతం తవ్వి తీసి సీక్వెల్స్ చేయ‌డం అక్క‌డో స్టైల్. ఇది కేవ‌లం బాలీవుడ్ కి మాత్రమే చెల్లింది. వాటికి స‌క్సెస్ రేట్ కూడా అలాగే ఉంటుంది. ఫెయిలైంది? చాలా త‌క్కువ సంద‌ర్భాల్లోనే? అందుకే మేక‌ర్స్ అంతా సీక్వెల్స్ విష‌యంలో ఎంతో కాన్పిడెంట్ గా ఉంటారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఏకంగా 27 ఏళ్లు వెన‌క్కే వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. 27 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన 'బార్డ‌ర్' అప్ప‌ట్లో ఎలాంటి విజ‌యాన్ని న‌మోదు చేసిందో తెలిసిందే. సైనికుల త్యాగాల‌ను, వారి పోరాటాల‌ను చూపించిన చిత్ర‌మ‌ది. ఇండో-పాకిస్తాన్ యుద్దం నేప‌థ్యంలో రూపొందిన సినిమా అప్ప‌ట్లో బాక్సాఫీస్ ని వ‌సూళ్ల‌తో షేక్ చేసింది. స‌న్ని డియోల్, జాకీ ష్రాప్, సునీల్ శెట్టి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రాన్ని జేపీ ద‌త్తా తెర‌కెక్కించారు.

క‌థ‌, భావోద్వేగాలు, సంగీతంతో ఎంతో మంది ప్రేక్షకుల్ని క‌దిలించిన చిత్ర‌మిది. ఈ సినిమా విడుద‌లై నేటితో 27 ఏళ్లు పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమాకి సీక్వెల్ ని ప్ర‌క‌టించారు. దానికి సంబంధించి స‌న్నీడియోలో ఓ వీడియో కూడా రిలీజ్ చేసారు. 'ఓ సైనికుడు 27 ఏళ్ల త‌ర్వాత త‌న మాట‌ను నిల‌బెట్టు కోవ‌డానికి బార్డ‌ర్ లోకి తిరిగి వ‌చ్చాడు. భారీ బ‌డ్జెట్ తో అతి పెద్ద వార్ ప్రాజెక్ట్ గా దీన్ని రూపొందిస్తాం.

అనురాగ్ సింగ్ రూపొందిస్తున్న‌ ఈ సినిమా త్వ‌ర‌లోనే మీ ముందుకు రాబోతుంద‌ని తెలిపారు. ఈ చిత్రాన్ని జేపీ ద‌త్తా, భూష‌ణ కుమార్, క్రిష‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో ఆయుశ్మాన్ ఖురానీ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఈ సీక్వెల్ కి ద‌ర్శ‌కుడు మారాడు. జేపీ ద‌త్తా స్థానంలో అనురాగ్ వ‌చ్చాడు. జేపీ మాత్రం నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Tags:    

Similar News