దసరాలో మిల్కీ రంగుల పండుగేంటి?
తమన్నా నలుపు లైనర్ - లిప్ గ్లాస్‌తో సున్నితమైన మేకప్ రూపంలో ఆకట్టుకుంటోంది. మిల్కీ స్టన్నింగ్ గ్లామరస్ లుక్ ఇన్‌స్టాగ్రామ్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది.
ఊరంతా దసరా ఉత్సవాల్లో ఉన్నారు. నవరాత్రులు.. పూజలు పునస్కారాలు అంటూ ఎవరి వ్యాపకంలో వారు ఉన్నారు. ఇంతలోనే మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా ఏం చేసిందో తెలుసా? అందాల తమన్నా దసరాలో కూడా రంగుల పండుగ తెచ్చింది. ఇదిగో ఇక్కడ రంగు రంగుల డిజైనర్ లుక్ లో కనిపించి కుర్రకారు గుండెల్ని గిచ్చేసింది.
తమన్నా భాటియా సోషల్ మీడియాలో కొన్ని అద్భుతమైన ఫోటోలను షేర్ చేసింది. ఈ లుక్ సంథింగ్ స్పెషల్ గా ఆకట్టుకుంది. ఎంపిక చేసుకున్న డీప్ నెక్‌లైన్.. రంగురంగుల పూల దుస్తుల్లో తమన్నా అద్భుతంగా కనిపించింది. పింక్ అండ్ రెడ్ కలర్ సహా రకరకాల రంగుల అద్దకంతో రూపొందించిన ఈ డిజైనర్ గౌన్ ఎంతో అందంగా ఉంది. తమన్నా నలుపు లైనర్ - లిప్ గ్లాస్‌తో సున్నితమైన మేకప్ రూపంలో ఆకట్టుకుంటోంది. మిల్కీ స్టన్నింగ్ గ్లామరస్ లుక్ ఇన్‌స్టాగ్రామ్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. మిల్కీ రంగురంగుల పూలమ్మాయ్ అంటూ అభిమానులు సరదాగా కామెంట్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇన్ స్టాలో లక్షలాదిగా అభిమానుల లైక్‌లను సంపాదించింది. ఇటీవల, తమన్నా తన ఫ్యాషన్ ఎంపికలతో మతులు చెడగొడుతోంది. బోల్డ్ అండ్ డేరింగ్ పాత్రలతో హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. తమన్నా లవ్ లైఫ్ ఇటీవల మీడియాలో చర్చనీయాంశమైంది. ప్రస్తుత బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మతో తమన్నా రిలేషన్ షిప్ పై బోలెడంత చర్చ సాగుతోంది.