ది కిల్లర్ మూవీ అక్కడలా… ఇక్కడిలా..

అయితే కొన్ని సినిమాలు హాలీవుడ్ లో ఇంగ్లీష్ కంట్రీస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయిన కూడా భారతీయులకి మాత్రం పెద్దగా నచ్చవు.

Update: 2023-11-11 17:30 GMT

హాలీవుడ్ సినిమాలకి ఇండియాలో కూడా మంచి ఆదరణ ఉంటుంది. దర్శకుల బట్టి కూడా ఇండియాలో సిటీ ఆడియన్స్ నుంచి స్పందన ఉంటుంది. ఈ కారణంగానే ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఆ సినిమాలకి ప్రేక్షకాదరణ లభిస్తూ ఉంటుంది. అయితే కొన్ని సినిమాలు హాలీవుడ్ లో ఇంగ్లీష్ కంట్రీస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయిన కూడా భారతీయులకి మాత్రం పెద్దగా నచ్చవు. అలాంటి వాటిలో ఇప్పుడు ది కిల్లర్ మూవీ కూడా ఒకటి.

సెవెన్, ఫైట్ క్లబ్, ది గేమ్, పానిక్ రూమ్, జోడిక్, గాన్ గర్ల్, మాంక్ సినిమాలని తెరకెక్కించిన దర్శకుడు డేవిడ్ ఫించర్ నుంచి ఈ మూవీ వచ్చింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు చాలా వరకు సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకున్నాయి. ఈ కారణంగానే ది కిల్లర్ మూవీపైన కూడా హై ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.

ప్రముఖ ఇంగ్లీష్ రివ్యూ వెబ్ సైట్ రోటన్ టమటోస్ ఈ చిత్రానికి ఏకంగా 86% క్రిటిక్స్ రేటింగ్, 72 ఆడియన్స్ రేటింగ్ ఇచ్చింది. అంటే హాలీవుడ్ ప్రేక్షకులకి ఈ మూవీ భాగా నచ్చిందని అర్ధమవుతోంది. విమర్శకుల ప్రశంసలు కూడా సినిమా సొంతం చేసుకుంది. ఈ కారణంగానే ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ అవుతోదంటే ఇండియన్ ఆడియన్స్ చాలా క్యూరియాసిటీతో ఎదురుచూశారు.

నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి ఊహించని విధంగా ఇండియన్ ఆడియన్స్ నుంచి నెగిటివ్ రివ్యూలు వస్తున్నాయి. మరీ హైప్ ఇచ్చిన స్థాయిలో సినిమా లేదని తేల్చేస్తున్నారు. దీనిని బట్టి ఇంగ్లీష్ కంట్రీస్ లో ఆడియన్స్ కి నచ్చిన ప్రతి సినిమా ఇండియన్ ఆడియన్స్ కి నచ్చాలని లేదు, నచ్చే అవకాశం ఉండదు. ప్రాంతాల బట్టి ఆడియన్స్ టేస్ట్ మారిపోతూ ఉంటాయి.

నార్త్ లో సూపర్ హిట్ అయిన సినిమాలలో చాలా వరకు సౌత్ ఆడియన్స్ కి కనెక్ట్ కావు. అలాగే సౌత్ లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాలని హిందీలో రీమేక్ చేసిన ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఆడియన్స్ అభిప్రాయం దేశీయ సినిమాలకే మారిపోతోంది. ఇక హాలీవుడ్ సినిమాలకి అయితే ఆడియన్స్ టేస్ట్ విషయంలో చాలా వ్యత్యాసం ఉండే అవకాశం ఉందనే మాట సినీ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.

Tags:    

Similar News