చివరి ఫోటో.. సూపర్ స్టార్‌ జ్ఞాపకాల్లో కూతురు

తన గుండెల్లో ఎప్పటికీ నాన్న జ్ఞాపకాలను, ఈ ఫోటోలను భద్రపర్చుకుంటాను అన్నట్లుగా మంజుల పేర్కొన్నారు.

Update: 2023-11-08 07:14 GMT

సూపర్ స్టార్‌ కృష్ణ మరణించి అప్పుడే ఏడాది కావస్తుంది. అయినా కూడా ఇంకా ఆయన జ్ఞాపకాల్లోంచి అభిమానులు మరియు ప్రేక్షకులు బయటకు రాలేక పోతున్నారు. గత ఏడాది నవంబర్ 15న మృతి చెందిన కృష్ణ మొదటి వర్ధంతి రాబోతుంది. ఈ సమయంలో ఆయన కూతురు మంజుల ఘట్టమనేని తండ్రి కి సంబంధించిన ఫోటోను షేర్ చేసి ఎమోషనల్ అయ్యారు.


నేడు ఆమె పుట్టిన రోజు. గత ఏడాది సరిగ్గా ఇదే రోజు మంజుల తన తండ్రి కృష్ణ తో కలిసి కేక్‌ కట్ చేసి తన పుట్టిన రోజును జరుపుకుంది. ఆ రోజు తీసుకున్న ఫోటోలను షేర్ చేసిన మంజుల నాన్న తో ఇవే చివరి ఫోటోలు. ఈ ఫోటోలు నాకు అత్యంత విలువైనవి. ఈ ఫోటోల కంటే ప్రత్యేకమైనవి నాకు ఈ ప్రపంచంలో మరేమీ లేవు. నా యొక్క ప్రతి పుట్టిన రోజుకు నాన్న నా పక్కనే ఉండేవారు. కానీ ఈసారి ఆయన లేరు అంటూ మంజుల ఎమోషనల్ అయ్యారు.


ఈసారి ఆయన లేకున్నా ఆయన జ్ఞాపకాలుగా ఈ ఫోటోలు ఉన్నాయని ఆమె పోస్ట్‌ చేశారు. తన గుండెల్లో ఎప్పటికీ నాన్న జ్ఞాపకాలను, ఈ ఫోటోలను భద్రపర్చుకుంటాను అన్నట్లుగా మంజుల పేర్కొన్నారు. మంజుల అంటే కృష్ణ కు అత్యంత ప్రేమ అంటూ పలు సందర్భాల్లో నిరూపితం అయింది.

మంజుల ఇండస్ట్రీలో అడుగు పెడతానంటే ఆయన పూర్తి మద్దతు, సహకారం అందించారు. కానీ ఆమెకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు.. కొన్ని కారణాల వల్ల ఆమె అప్పుడు ఇండస్ట్రీకి దూరం అయ్యారు. అయితే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

గత ఏడాది ఘట్టమనేని ఫ్యామిలీకి మర్చిపోలేని సంవత్సరంగా మిగిలింది. ఒకే ఏడాది ఫ్యామిలీకి చెందిన రమేష్‌ బాబు, ఇందిరా దేవి, కృష్ణ మృతి చెందారు. త్వరలో కృష్ణ వర్ధింతి రాబోతున్న నేపథ్యంలో అంతకు ముందే ఆయన అభిమానులు మరోసారి తలుచుకునే విధంగా మంజుల ఈ ఫోటోలను షేర్‌ చేశారు.

Tags:    

Similar News