చీర కట్టిన చిన్నది ఆహా రెబ్బా అనిపిస్తుందే!
ఎలాంటి డిజైనర్ దుస్తులు ధరించినా రానంత హైప్ సంప్రదాయ చీరకట్టుకు మాత్రమే సాధ్యం.
చీరందంలో ఏ బ్యూటీని వర్ణిచంగలం. అసలు వర్ణన సాధ్యమేనా? ఆ చీరకున్న ప్రత్యేతక అలాంటింది మరి. చీర..రవిక ధరించిన ఏ బ్యూటీ అయినా నెట్టింట స్పెషల్ గా ఫోకస్ అవుతుంది. ఎలాంటి డిజైనర్ దుస్తులు ధరించినా రానంత హైప్ సంప్రదాయ చీరకట్టుకు మాత్రమే సాధ్యం. అందుకే భామా మణులంతా అప్పుడప్పుడు చీరందంలో మురిపిస్తుంటారు. తాజాగా తెలుగమ్మాయి ఈషారెబ్బా చీరందంలో తళుకు లీనింది.
తల కురుల నుంచి కాలి పాదం వరకూ అమ్మడు అందానికి ఎంతటివారైనా మంత్రముగ్దులవ్వాల్సిందే అన్నంత అందంగా ముస్తాబైంది. అందమైన కళ్లకు నల్లని కాటుక...నుదిటిన సన్నని ఎర్రని బొట్టు.. .. పెదాలపై పలచగా పూసిన లిప్ స్కిట్... అది స్కిన్ ని మ్యాచ్ చేసిన వైనం...అదే పెదాలపై అంతకు మించిన అందమైన చిరునవ్వుతో! ఆకట్టుకుంటుంది.
నలుపు రంగు రవిక....ఆ రవికని మ్యాచ్ చేస్తూ గోధమ వర్ణం పువ్వుల డిజైన్ తో కూడిన చీర..ఆ చీరకున్న అంచు ఒక ఎత్తైతే...సరిగ్గా ఆ నడుమ అందాన్ని పర్పెక్ట్ గా ఎలివేస్ చేసి ఇచ్చిన భంగిమ మొత్తం రూపాన్నే మార్చేసింది. ఆ చీరకొంగును అలా నడుములోతుల్లోకి బిగించేసి కనికట్టు చేసేసింది. ఈ భంగిమలో ఆహా రెబ్బా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పిక్ చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
ట్రెడీషనల్ సారీ లుక్ లో బ్యూటీ కుర్రాళ్లని ఆకర్షిస్తుంది. ఇలా చీరందంలో కునువిందు చేయడం సొసగరికి కొత్తేం కాదు. కానీ చీరెప్పుడు వన్నె తీసుకొస్తుంది! అనడానికి మరోక ఎగ్జాంపుల్ ఇది. ఇక ఈషారెబ్బా కెరీర్ గురించి తెలిసిందే. సరైన ఛాన్సులు కోసం ఎదురుచూస్తుంది. చిన్న చిత్రాల్లో మెయిన్ లీడ్స్ వచ్చినా సైన్ చేయడంలో లేదు. పెద్ద సినిమా ఒకటి చేసినా చాలు అనుకుని వెయిట్ చేస్తోంది.