చరణ్‌ ఫ్యాన్స్‌ ఆవేదనలో అర్థం ఉంది!

అందుకే ఆయన తో సినిమా అంటే కచ్చితంగా గొప్ప విషయం అన్నట్లుగా ఫ్యాన్స్ ఆనందపడ్డారు.

Update: 2023-11-17 16:45 GMT

రామ్‌ చరణ్‌ 'ఆర్‌ఆర్ఆర్‌' సినిమా విడుదల అవ్వక ముందే శంకర్‌ దర్శకత్వంలో సినిమాను కన్ఫర్మ్‌ చేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. సౌత్‌ లో రాజమౌళి తర్వాత ఆ స్థాయి దర్శకుడు అంటూ శంకర్ కి గుర్తింపు ఉంది. అందుకే ఆయన తో సినిమా అంటే కచ్చితంగా గొప్ప విషయం అన్నట్లుగా ఫ్యాన్స్ ఆనందపడ్డారు.

ఆ ఆనందం చరణ్‌ ఫ్యాన్స్‌ కి ఎక్కువ కాలం నిలువలేదు. దిల్‌ రాజు నిర్మిస్తున్న చరణ్‌, శంకర్‌ ల గేమ్‌ చేంజర్ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. అదుగో ఇదుగో అంటూ సినిమాను వాయిదా వేస్తున్నారు. ఇంతగా వాయిదాలు పడటానికి కారణం శంకర్‌ చేస్తున్న ఇండియన్ 2 అంటూ మెగా ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు.

ఇండియన్ 2 సినిమా ఆగి పోవడంతో గేమ్‌ చేంజర్ సినిమాను మొదలు పెట్టాడు. మద్యవర్తులు ఒప్పించడంతో శంకర్ మళ్లీ ఇండియన్‌ 2 సినిమాను మొదలు పెట్టాడు. ఆ సినిమాను మొదలు పెట్టి గేమ్‌ చేంజర్ సినిమా విషయంలో చిన్న చూపు చూస్తున్నాడు. టైమ్ ఉన్నప్పుడు గేమ్‌ చేంజర్‌ చేస్తున్నాడు అని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతికి అనుకున్న గేమ్‌ చేంజర్‌ వచ్చే ఏడాది చివరి వరకు అయినా వచ్చేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటూ ఫ్యాన్స్ లో చర్చ జరుగుతున్నప్పుడు కచ్చితంగా ఇది శంకర్‌ ఇండియన్‌ 2 కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం వల్లే అనిపిస్తుందని వారు అంటున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి భారీ విజయం తర్వాత చరణ్‌ నుంచి సినిమా అంటే పాన్‌ ఇండియా రేంజ్ లో ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో శంకర్‌ ఇలా చేయడంతో ఫ్యాన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలు చేయడంలో అర్థం ఉంది అనిపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News