ఓవర్సీస్.. హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాలీవుడ్ మూవీస్ ఇవే..

అక్కడ తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండటంతో మన సినిమాలకి మంచి ఆదరణ లబిస్తూ ఉంటుంది.

Update: 2024-01-16 20:36 GMT

టాలీవుడ్ మూవీస్ కి తెలుగు రాష్ట్రాల తర్వాత అతి పెద్ద బాక్సాఫీస్ మార్కెట్ అంటే ఓవర్సీస్ అని చెప్పాలి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో తెలుగు సినిమాలకి మంచి ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాలకి అయితే భారీ ఎత్తున ప్రీమియర్స్ పడతాయి. అక్కడ తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండటంతో మన సినిమాలకి మంచి ఆదరణ లబిస్తూ ఉంటుంది.

కలెక్షన్స్ పరంగా కూడా ఈ మధ్యకాలంలో నార్త్ ఇండియాలో కూడా తెలుగు మూవీస్ మంచి వసూళ్లు రాబడుతున్నాయి. అయితే పాన్ ఇండియా బ్రాండ్ లేకుండానే సూపర్ స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాలకి ఓవర్సీస్ లో మంచి వసూళ్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇక పాన్ ఇండియా బ్రాండ్ వచ్చిన తర్వాత తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా స్టార్ హీరోల చిత్రాలని ఓవర్సీస్ లో రిలీజ్ చేస్తూ ఉండటంతో కలెక్షన్స్ మరింత ఎక్కువగా వస్తున్నాయి.

ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాల జాబితాలో బాహుబలి 2 మొదటి స్థానంలో ఉంది. తరువాత ఆర్ఆర్ఆర్ రెండో స్థానంలో నిలిచింది. సలార్ మూడో ప్లేస్ లో ఉంది. తరువాత అల వైకుంఠపురంలో, ఆరో స్థానంలో రంగస్థలం మూవీ, ఎదో స్థానంలో భరత్ అనే నేను, ఎనిమిదో స్థానంలో సాహో, తొమ్మిదో స్థానంలో ఆదిపురుష్, పదో స్థానంలో హనుమాన్ మూవీ నిలిచింది.

కేవలం నాలుగు రోజుల్లోనే ఈ మూవీ 3 మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరిపోయింది. చిన్న సినిమాగా వచ్చి తక్కువ టైంలోనే ఓవర్సీస్ లో భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా ఈ మూవీ నిలిచింది. హనుమాన్ ఇదే స్పీడ్ కొనసాగితే టాప్ 5లో ఉన్న అల వైకుంఠపురంలో మూవీ కలెక్షన్స్ ని చాలా ఈజీగా బీట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఆదిపురుష్ మూవీ - $20.76 M

ఆర్ఆర్ఆర్ మూవీ - $14.83M

సలార్ మూవీ - $8.90M

ఆల వైకుంఠపురంలో - $3.63M

రంగస్థలం మూవీ - $3.51M

భరత్ అనే నేను - $3.41M

సాహో - $3.23M

అధిపురుష్ - $3.16M

హనుమాన్ - $3.05M (నాలుగు రోజుల్లో)

Tags:    

Similar News