ది వ్యాక్సిన్ వార్ టాక్ ఏంటి..?

వివేక్ అగ్నిహోత్రి ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో దేశం మొత్తం హాట్ టాపిక్ గా నిలిచిన దర్శకుడు. ఆయన సినిమాలే కాదు సోషల్ మీడియా కామెంట్స్ కూడా అటెన్షన్ ని తీసుకొస్తాయి

Update: 2023-09-29 07:23 GMT

వివేక్ అగ్నిహోత్రి ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో దేశం మొత్తం హాట్ టాపిక్ గా నిలిచిన దర్శకుడు. ఆయన సినిమాలే కాదు సోషల్ మీడియా కామెంట్స్ కూడా అటెన్షన్ ని తీసుకొస్తాయి. ఆదిపురుష్ రిలీజ్ టైం లో ప్రభాస్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసిన వివేక్ అగ్నిహోత్రి ఆయన డైరెక్ట్ చేసిన ది వ్యాక్సిన్ వార్ సినిమాను కూడా ప్రభాస్ సలార్ కి పోటీగా సెప్టెంబర్ 28న రిలీజ్ లాక్ చేశారు. అయితే ప్రభాస్ సలార్ సినిమా వాయిదా పడటంతో వివేక్ సినిమా రిలీజ్ చేశారు.

ఇంతకీ వ్యాక్సిన్ వార్ కథ ఏంటి అంటే.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ ఆధ్వర్యంలో డైరెక్టర్ భార్గవ (నానా పటేకర్) తన టీంతో న్యుమోనియా ని అరికట్టే వ్యాక్సిన్ ని సిద్ధం చేయాలని నిర్ణయించుకుంటారు. అదే టైంలో కరోనా విజృంభిస్తుంది. ప్రజలంతా కూడా మీడియా కథనాలతో భయాన్ని కలిగి ఉంటారు. లక్షల ప్రాణాలు పోతుంటాయి. ఈ పరిస్థితుల్లో వైరాలజీ ఇన్ స్ట్యూట్ భార్గవ టీం తో కలిసి కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టాలని అనుకుంటారు.

ఆ పరిస్థితుల్లో లేడీ సైంటిస్టులు ఎలా పనిచేశారు. వ్యాక్సిన్ సాధించి ఎలా సక్సెస్ అయ్యారన్నది సినిమా కథ. కోవిడ్ నేపథ్యంతో కథ నడిపించిన తీరు బాగున్నా 2 గంటల 40 నిమిషాల రన్ టైం సినిమాను కాస్త నీరసం తెప్పిస్తుంది. అయితే కోవిడ్ వ్యాప్తి జరగడంలో ప్రభుత్వాల వైఫల్యం, జనాల తప్పులు కూడా డీటైల్డ్ గా చూపించారు. ఫస్ట్ హాఫ్ మొత్తం స్లో గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. నానా పటేకర్ తో పాటుగా పల్లవి జోషి నటన ఆకట్టుకుంది. మిగతా నటీనటులు కూడా బాగానే చేశారు.

కాశ్మీర్ ఫైల్స్ అంత రీచ్ అవ్వదు కానీ ది వ్యాక్సిన్ వార్ కమర్షియల్ గా సక్సెస్ అవడం కాస్త కష్టమే అని చెప్పొచ్చు. కోవిడ్ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు రాగా వివేక్ మార్క్ స్క్రీన్ ప్లే అక్కడక్కడ మెప్పించినా సినిమా లో మిగతా పాయింట్స్ అన్ని ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల ఆడియన్స్ నుంచి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ అందుకుంటుంది ది వ్యాక్సిన్ వార్.

Tags:    

Similar News