ఈవారం@30+.. జాతరే జాతర
ప్రతి శుక్రవారం థియేటర్ల ద్వారా భారీ ఎత్తున సినిమాలు సినీ ప్రేమికులకు వినోదాన్ని పంచేందుకు వస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం.
ప్రతి శుక్రవారం థియేటర్ల ద్వారా భారీ ఎత్తున సినిమాలు సినీ ప్రేమికులకు వినోదాన్ని పంచేందుకు వస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. థియేట్రికల్ రిలీజ్ తో పాటు ఓటీటీ స్ట్రీమింగ్ కూడా ఈమధ్య కాలంలో చాలా కీలకం అయింది. థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల కంటే ఓటీటీ ద్వారా సినిమాలు, సిరీస్ లు చూసే వారు ఎక్కువ అయ్యారు.
ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా పెద్ద ఎత్తున సినిమాలు మరియు సిరీస్ లు ఓటీటీ ద్వార ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నాయి. కొన్ని సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అయ్యి ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీగా ఉండగా, మరికొన్ని సినిమాలు సిరీస్ లు డైరెక్ట్ గా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
తెలుగు సినిమాలు సిరీస్ లు ఈ వారం పెద్దగా లేవు. కానీ ఇంగ్లీష్ మరియు హిందీ వెబ్ సిరీస్ లు మరియు సినిమాలతో ఓటీటీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు ఓటీటీ లు రెడీగా ఉన్నాయి. మొత్తానికి అమెజాన్ తో పాటు నెట్ ఫ్లిక్స్ లో ఇండియన్ ఓటీటీ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం ఈ వారం దక్కబోతుంది.
హాయ్ నాన్న మరియు ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమాలు థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, 30 కి మించిన సినిమాలు మరియు సిరీస్ లు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఓటీటీ పుణ్యమా అని తెలుగు ప్రేక్షకులు ఇతర భాషల కంటెంట్ ను డబ్బింగ్ ద్వారా లేదా సబ్ టైటిల్స్ ద్వారా చూస్తూ వినోదాన్ని పొందుతున్నారు.
జిగర్ తాండ డబుల్ ఎక్స్, కూసే మునిస్వామి వీరప్పన్, వధువు ఇలా సినిమాలు, సిరీస్ లు తెలుగు లో డబ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అన్ని భాషల సినిమాలు, సిరీస్ లు కలిపి 30 కి పైగా ఉండటంతో వినోదాల జాతరే జాతర అన్నట్లుగా ఓటీటీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.