2023 రీమేక్ లకు కలిసిరాలేదు..!
2023 సినిమాల సక్సెస్ రేషియో కన్నా భారీ అంచనాలతో వచ్చి నిరాశపరిచిన సినిమాలే ఎక్కువ అని చెప్పొచ్చు. వాటిలో రీమేక్ సినిమాలు కూడా ఉన్నాయి.
2023 సినిమాల సక్సెస్ రేషియో కన్నా భారీ అంచనాలతో వచ్చి నిరాశపరిచిన సినిమాలే ఎక్కువ అని చెప్పొచ్చు. వాటిలో రీమేక్ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ ఇయర్ సీనియర్ స్టార్స్ నుంచి యువ హీరోల వరకు అందరు రీమేక్ లు చేశారు. అయితే ఓటీటీ ల వల్ల ఆల్రెడీ ఒరిజినల్ వెర్షన్ చూసిన తెలుగు ఆడియన్స్ కు ఈ రీమేక్ లు అంతగా రుచించలేదు. ఒకప్పుడు పరిస్థితి వేరు కానీ ఇప్పుడు ఏ భాషలో సినిమా అయినా సరే హిట్ అయ్యింది అంటే ఓటీటీలో చూసేస్తున్నారు సినీ ప్రియులు. మళ్లీ వాటిని రీమేక్ చేయడం వల్ల ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది.
2023 లో రీమేక్ చేసిన సినిమాల్లో భారీ అంచనాలతో వచ్చిన నిరాశ పరిచిన సినిమా భోళా శంకర్. తమిళ సినిమా వేదాళం రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ కూడా మొదటి నుంచి డౌట్ పడుతూనే ఉన్నారు. మెహర్ రమేష్ ట్రాక్ రికార్డ్ తెలిసి కూడా చిరు ఎందుకు ఈ సినిమా చేశారని సోషల్ మీడియాలో హడావుడి చేశారు. ఫైనల్ గా సినిమా రిజల్ట్ కూడా అలానే వచ్చింది.
ఇక ఈ ఇయర్ రీమేక్ గా వచ్చి నిరాశ పరిచిన మరో క్రేజీ మూవీ రవితేజ రావణాసుర. బెంగాళి మూవీ విన్సీ దా రీమేక్ గా వచ్చిన రావణాసుర సినిమా సుధీర్ వర్మ డైరెక్ట్ చేశారు. కానీ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని దక్కించుకోలేదు.
తమిళ సినిమా వినోదయ సీతం ని తెలుగులో బ్రో గా రీమేక్ చేశారు. పవన్ కళ్యాణ్, సాయి ధరం తేజ్ కలిసి నటించిన ఈ సినిమాను మాతృక దర్శకుడు సముద్రఖని డైరెక్ట్ చేశారు. బ్రో సినిమా కూడా పవన్ కళ్యాణ్ రేంజ్ కి తగిన రిజల్ట్ దక్కించుకోలేదు. సినిమాను పవన్ కళ్యాణ్ కేవలం 20 రోజుల్లో పూర్తి చేశారు. త్వరగా చుట్టేయడం వల్లే ఫలితం కూడా అలానే వచ్చిందని అనుకోవచ్చు.
ఇక మరాఠి సినిమా నట సామ్రాట్ రీమేక్ గా కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన రంగమార్తాండ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరచింది. రివ్యూస్ పాజిటివ్ గా వచ్చినా సరే ఈ సినిమాను ఆడియన్స్ పట్టించుకోలేదు.
తెలుగు ప్రేక్షకులు ఒరిజినల్ కథలకే ఓటు వేస్తున్నారు. ఆల్రెడీ తీసిన సినిమాను రీమేక్ గా కాదు ఒక కొత్త కథతో వస్తేనే ఎంకరేజ్ చేస్తాం అన్నట్టుగా వాళ్ల మైండ్ సెట్ ఫిక్స్ చేసుకున్నారు. అందుకే రీమేక్ ల వల్ల దెబ్బతింటున్న హీరోలు ఇక మీదట వాటి జోలికి వెళ్లకూడదని అనుకుంటున్నారు.