ఆ ఐదుగురు సౌత్‌లో మొదలై అగ్రతారలయ్యారు
సౌత్ ఇండియన్ సినిమాల ద్వారా హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడం అనేది విజయానికి ఒక ఫార్ములా.
కొత్త వారికి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం కచ్చితంగా కష్టమే. సూపర్ స్టార్ సరసన నటించిన ప్రతి ఒక్క నటీమణి విజయవంతంగా వెండితెరపై వెలిగిపోలేరు. కొందరు హీరోయిన్లు దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తమ మొదటి అడుగు వేయడం ద్వారా బాలీవుడ్‌లో విజయాల మెట్లు ఎక్కుతున్నారు. పలువురు నాయికలు ఎలాంటి సపోర్టు లేకుండానే బాలీవుడ్‌లో పెద్ద ఎత్తున దూసుకుపోయారు. సౌత్ ఇండియన్ సినిమాల ద్వారా హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడం అనేది విజయానికి ఒక ఫార్ములా.సౌతిండస్ట్రీలో కెరీర్ ప్రారంభించి బాలీవుడ్ లో అగ్ర పథానికి ఎదిగిన ఐదుగురు బాలీవుడ్ హీరోయన్ల గురించి ఈ స్టోరి...
హేమ మాలిని
హిందీ చిత్ర పరిశ్రమలో స్వర్ణయుగాన్ని శాసించిన బాలీవుడ్ నటి హేమమాలిని సౌత్ ఇండియన్ సినిమాల్లో తన కెరీర్‌ను ప్రారంభించింది. డ్రీమ్ గర్ల్ గా ఆమె పాపులరయ్యారు. హేమ మాలిని తమిళ చిత్రం `ఇదు సత్యం`తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత `సప్నో కా సౌదాగర్`తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత షోలే -బాగ్‌బాన్ -నసీబ్ వంటి బంపర్ హిట్ చిత్రాల్లో నటించారు. హేమ మాలిని రాజకీయ రంగంలోను రాణించారు.
ప్రియాంక చోప్రా
బాలీవుడ్ టు హాలీవుడ్ తన కీర్తిని విస్తరించిన ప్రియాంక చోప్రా తొలిగా ఓ సౌత్ సినిమాలోనే నటించారు. తమిజాన్ అనే తమిళ చలనచిత్రంతో తెరంగేట్రం చేసింది. బాజీరావ్ మస్తానీ-బర్ఫీ-మేరీ కోమ్- ఫ్యాషన్ సహా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది.
ఐశ్వర్యరాయ్ బచ్చన్
బాలీవుడ్‌లోని అగ్ర కథానాయికల్లో ఒకరైన ఐశ్వర్య రాయ్ బచ్చన్ 1994లో మిస్ వరల్డ్‌గా కిరీటం పొందిన తర్వాత సినీఆరంగేట్రం చేసారు. 1997లో తమిళ చిత్రం ఇరువర్‌తో తన నటనా జీవితాన్ని ప్రారంభించి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. తాళ్- దేవదాస్ -ధూమ్ 2-రావణ్ -జోధా అక్బర్ వంటి హిట్ చిత్రాలలో నటించింది. బాలీవుడ్ ని అగ్ర హీరోయిన్ గా ఏలారు.
దీపికా పదుకొనే
దీపికా పదుకొణె `ఓం శాంతి ఓం`లో శాంతిప్రియగా నటించడానికి ముందే కన్నడ సినిమా `ఐశ్వర్య`లో ఉపేంద్ర సరసన నటించారు. ఆ తర్వాతే షారూఖ్ ఖాన్ సరసన దీపిక బాలీవుడ్ లో ఘనమైన అరంగేట్రం చేసింది. అయితే పరిశ్రమలో స్థిరంగా ఉండటానికి ఆమె చేసిన పోరాటం చాలా పెద్దదే. ఇప్పుడు భారతదేశంలోనే టాప్ 5 హీరోయిన్లలో ఒకరిగా వెలిగిపోతున్నారు. బాజీరావ్ మస్తానీ-పద్మావత్ -పికూ- పఠాన్ వంటి బ్లాక్ బస్టర్లలో నటించారు.
తాప్సీ పన్ను
పింక్ -తప్పడ్ వంటి సామాజిక నేపథ్య చిత్రాలలో శక్తివంతమైన పాత్రలతో పేరు తెచ్చుకున్న తాప్సీ అంతకుముందు సౌతిండస్ట్రీలో తన కెరీర్‌ను ప్రారంభించారు. తాప్సీ పన్ను తెలుగులో ఝుమ్మంది నాదం, తమిళంలో `ఆడుకలం` చిత్రాలతో అరంగేట్రం చేసిన తర్వాత సౌత్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గొప్ప పేరు తెచ్చుకుంది. సౌత్‌లో సక్సెస్ అయిన తర్వాత బాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.