పాన్ ఇండియా సక్సెస్ లో ఆ మూడింట కామన్ పాయింట్!
పాన్ ఇండియాలో రిలీజ్ అయిన `దేవర`, `పుష్ప-2`,` క` చిత్రాలు మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
పాన్ ఇండియాలో రిలీజ్ అయిన `దేవర`, `పుష్ప-2`,` క` చిత్రాలు మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. `దేవర`, `పుష్ప-2` చిత్రాలకు ఇండియా వైడ్ భారీ ఎత్తున థియేటర్లు దొరకడంతో భారీ స్థాయిలో వసూళ్లను సాధించగలిగాయి. కానీ `క` సినిమాకు అనుకున్న స్థాయిలో థియేటర్లు దొరకలేదు. తమిళనాడులో అయితే ఒక్క థియేటర్ కూడా దొరకని పరిస్థితి కిరణ్ అబ్బవరం వివరించిన సంగతి తెలిసిందే. థియేటర్లు దొరికి ఉంటే ఇంకా పెద్ద సక్సెస్ అయ్యేది.
ఈ ఏడాది చిన్న సినిమాగా రిలీజ్ అయిన పెద్ద విజయం సాధించిన చిత్రం ఏది అంటే `క` మాత్రమే వినిపిస్తుంది. ఇక `దేవర` కు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్ల విషయంలో ఎక్కడా తగ్గలేదు. 500 కోట్ల క్లబ్ లో సునాయాసంగా చేరిపోయింది. `పుష్ప-2` సంచలనం గురించైతే చెప్పాల్సిన పనిలేదు. హిందీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిం చింది. ఖాన్ లు..కపూర్ ల రికార్డులను తిరగరాసింది. అయితే ఈ మూడు సినిమాల్లో ఉన్న కామన్ పాయింట్ పాన్ ఇండియాకి బాగా కనెక్ట్ అయింది.
మూడు చిత్రాల్లోనూ ఉన్న జాతర సాంగ్ లు ఏ రేంజ్ బ్లాస్ట్ అయ్యాయో చెప్పాల్సిన పనిలేదు. `క`లోని `ఆడు ఆడు నిలువెల్లా పూనకమే` సాంగ్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అలాగే `దేవర` లో `ఆయుధ పూజ` పాట పూనకాలే తెప్పిం చింది. రీల్స్ లో సంచలనమే సృష్టించింది. ఆ పాటకు రీల్స్ చేయని వారు లేరు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. ఇక `పుష్ప-2` లో `గంగమ్మ తల్లి జాతర సాంగ్ `ఏ రేంజ్ లో ఊపేసిందో చెప్పాల్సిన పనిలేదు.
ఆ పాటలో సన్నివేశాలకే బన్నీకి మరోసారి జాతీయ అవార్డు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని బలంగా విని పిస్తుంది. బన్నీ కెరీర్ లో బెస్ట్ పెర్పార్మర్ గా ఆపాట హైలైట్ అయింది. సాధారణంగా ఇలాంటి పాటలు హిందీ సినిమాల్లో పెద్దగా కనిపించవు. ఉత్తరాదిన అభిమానులకు జాతర పాటలు కొత్త అనుభవాన్ని అందించాయి. ఈ మూడు పాటలకు అక్కడ ఆడయన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. థియేటర్లలోనే అమ్మోరు తల్లి పూనినట్లు పూనకాలకు గురయ్యారు.