టిల్లు స్క్వేర్​ సెంటిమెంట్.. లేదంటే గట్టి దెబ్బే!

'మరోసారి నవ్వులు పూయిస్తూ చరిత్ర సృష్టించడానికి 'టిల్లు స్వ్కేర్‌' వచ్చేస్తున్నాడంటూ కొత్త రిలీజ్​ డేట్​ను మూవీటీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Update: 2023-10-28 07:31 GMT
టిల్లు స్క్వేర్​ సెంటిమెంట్.. లేదంటే గట్టి దెబ్బే!
  • whatsapp icon

'మరోసారి నవ్వులు పూయిస్తూ చరిత్ర సృష్టించడానికి 'టిల్లు స్వ్కేర్‌' వచ్చేస్తున్నాడంటూ కొత్త రిలీజ్​ డేట్​ను మూవీటీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9 రానున్నట్లు చెప్పారు. అయితే ఇప్పుడీ సినిమాకు ఓ సెంటిమెంట్​ వర్కౌట్​ అయితే సినిమా పక్కా బ్లాక్​ బాస్టర్​ అవుతుందని అంతా ఆశిస్తున్నారు. అదే అది వర్కౌట్ అవ్వకపోతే మాత్రం.. గట్టి దెబ్బ పడే అవకాశముంటుంది.

వివరాళ్లకి వెళితే.. సాధారణంగా ఫిబ్రవరి బాక్సాఫీస్​ అంటే చాలా తక్కువగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. ఎందుకంటే ఆ సమయంలో విద్యార్థులకు పరీక్షలు ఉండటంతో ఫ్యామిలీ ఆడియెన్స్​ థియేటర్లకు తక్కువగా వస్తుంటారు. అందుకే దర్శకనిర్మాతలు ఎక్కువగా సినిమాలు ఆ సమయంలో రిలీజ్ చేయరు.

అయితే గతఐదేళ్లుగా ఆ లెక్క మారుతూ వస్తోంది. ఆ నెలలో వచ్చే అడపాదడపా చిత్రాల్లో ఏదో ఒకటి బ్లాక్ బాస్టర్​ హిట్​ అయి మంచి వసూళ్లనే అందుకుంటున్నాయి. డీజే టిల్లూ.. 2022 ఫిబ్రవరిలో ఓ ఊపు ఊపేసింది. 2021 ఫిబ్రవరిలో ఉప్పెన వచ్చి బ్లాక్ బస్టర్ హిట్​గా నిలిచింది. 2020 ఫిబ్రవరిలోనూ నితిన్ హీరోగా వచ్చి భీష్మ సినిమా సూపర్ హిట్టయింది. ఇక 2017 నేచరల్ స్టార్ నాని నేను లోకల్​, 2018 వరుణ్ తేజ్​ తొలి ప్రేమ, నాగశౌర్య ఛలో.. అలా గడిచిన ఐదేళ్లలో ఏటా ఫిబ్రవరికి మీడియం రేంజ్​గా వచ్చిన చిత్రాల్లో ఓ హిట్ సినిమా పడుతోంది. అయితే 2019తో పాటు ఈ ఏడాది మాత్రమే ఆ మేజిక్ కాస్త తగ్గింది.

ఈ ఏడాది రైటర్ పద్మభూషణ్, మైఖేల్, బుట్టబొమ్మ, అమిగోస్, వేద, పాప్ కార్న్, వసంత కోకిల, అల్లంత దూరాన లాంటి సినిమాలు అంతగా ఆడలేదు. వీటిలో రైటర్ పద్మభూషణ్​ విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నా కమర్షియల్​గా అంత పెద్ద సక్సెస్​ ఏమీ అవ్వలేదు.

ఇక 2024లో క్రేజీ సీక్వెల్ టిల్లు స్క్వేర్​ రాబోతుంది. మేకర్స్​ ఈ సినిమా కచ్చితంగా హిట్​ కొడుతుందని తమ ట్వీట్​తో కాన్ఫీడెన్స్​ ప్రదర్శించారు. అలాగే తొలి భాగం సెన్సేషనల్​ హిట్​ కావడంతో రెండో భాగంపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. దీంతో ఫిబ్రవరి సెంటిమెంట్​తో టిల్లు కూడా మంచి హిట్ కొట్టే ఛాన్స్ ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఓకే టాక్ తేడా కొడితే మాత్రం దారుణంగా గట్టి దెబ్బ తగిలే అవకాశముంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Tags:    

Similar News