టిల్లు, ఫ్యామిలీ స్టార్.. అక్కడ కూడా మంచి బిజినెస్సే..
ఈ రెండు సినిమాలకి కర్ణాటకలో మంచి రిజల్ట్ వస్తే భవిష్యత్తులో మరిన్ని యూత్ ఫుల్ కంటెంట్ ఉన్న కథలని కూడా అక్కడి డిస్టిబ్యూటర్స్ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది
ఈ సమ్మర్ మొదట్లో అయితే పెద్ద బడ్జెట్ సినిమాలు ఏమి రావడం లేదు. పరీక్షల కాలం ముగిసిన తరువాత కొన్ని మీడియం బడ్జెట్ సినిమాలు రాబోతున్నాయి. ఇక అందులో డీజె టిల్లు సీక్వెల్ గా రానున్న టిల్లు స్క్వేర్, విజయ్ దేవరకొండ - పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న ఫ్యామిలీ స్టార్ మూవీ. ఈ రెండు సినిమాలకు కూడా మంచి బజ్ అయితే ఉంది.
సిద్దు జొన్నలగడ్డ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ లో తెరకెక్కుతోన్న టిల్లు స్క్వేర్ మార్చి 29న రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. డీజే టిల్లుతో సూపర్ హిట్ కొట్టిన సిద్దు టిల్లు స్క్వేర్ తో దానిని కొనసాగించాలని అనుకుంటున్నాడు.
మూవీపైన కూడా పాజిటివ్ బజ్ ఉంది. కచ్చితంగా ఈ మూవీకి సాలిడ్ ఓపెనింగ్స్ రావడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. ఈ సినిమాకి సంబందించిన థీయాట్రికల్, నాన్ థీయాట్రికల్ రైట్స్ ఇప్పటికే అమ్ముడైపోయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కర్ణాటక రిలీజ్ రైట్స్ ఏకంగా 75 లక్షలకి అమ్ముడయ్యాయని తెలుస్తోంది.
మీడియం రేంజ్ హీరో సినిమాకి ఈ స్థాయిలో రైట్స్ వచ్చాయంటే కన్నడనాట కూడా టిల్లు క్యారెక్టర్ కి ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారని అర్ధమవుతోంది. ఇక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకి కన్నడలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ గత సినిమాలు కన్నడంలో బాగా పెర్ఫార్మ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతోన్న ఫ్యామిలీ స్టార్ మూవీ కర్ణాటక రైట్స్ సాలిడ్ ధరకి అమ్ముడయ్యాయి.
ఏకంగా 2.70 కోట్లకి ఫ్యామిలీ స్టార్ రైట్స్ ని అక్కడి డిస్టిబ్యూటర్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. విజయ్ లాంటి టైర్ 2 హీరో మూవీకి కర్ణాటక నుంచి ఈ స్థాయిలో రైట్స్ కి రెస్పాన్స్ రావడం అంటే నిజంగా విశేషమని చెప్పాలి. దీనిని బట్టి కన్నడంలో కూడా విజయ్ కి మంచి క్రేజ్ ఉందని అర్ధమవుతోంది.
మరి కర్ణాటక డిస్టిబ్యూటర్స్ కి టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ ఎలాంటి లాభాలు తీసుకొస్తుందనేది వేచి చూడాలి. ఈ రెండు సినిమాలకి కర్ణాటకలో మంచి రిజల్ట్ వస్తే భవిష్యత్తులో మరిన్ని యూత్ ఫుల్ కంటెంట్ ఉన్న కథలని కూడా అక్కడి డిస్టిబ్యూటర్స్ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మొదట కర్ణాటకలో కేవలం అగ్ర హీరోల సినిమాలకు మాత్రమే సాలీడ్ రెస్పాన్స్ వచ్చేది. కానీ ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలు చిన్న హీరోలు కూడా కంటెంట్ తో మెప్పిస్తే సాలీడ్ హిట్స్ చూస్తున్నారు.