'మిస్టర్ అండ్ మిసెస్' అయ్యే తరుణం
కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన మంగళవారం రాత్రి తన ఇన్స్టాగ్రామ్ లో వరుణ్ - లావణ్యల మెహందీ వేడుక నుండి ఫోటోల బంచ్ ని షేర్ చేసారు.
మరికొద్ది గంటల్లో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి 'మిస్టర్ అండ్ మిసెస్' కానున్నారు. ఈ జంట నేడు (నవంబర్ 1న) ఇటలీలోని టుస్కనీలో వివాహం చేసుకోబోతున్నారు. నవ వధూవరుల లుక్ వీక్షణ కోసం అభిమానులు వేచి ఉండలేరు.. అందుకే నిరంతరం ప్రీవెడ్డింగ్ వేడుకల నుంచి ఫోటోలు వీడియోలను రిలీజ్ చేసారు. అవన్నీ వైరల్ గా మారాయి. హల్దీ, మెహందీ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చాయి. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన మంగళవారం రాత్రి తన ఇన్స్టాగ్రామ్ లో వరుణ్ - లావణ్యల మెహందీ వేడుక నుండి ఫోటోల బంచ్ ని షేర్ చేసారు. ఇవి మెహందీ నుంచి ఫోటోలు. అదే క్రమంలో హల్దీకి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. వరుణ్ రకరకాల డిజైనర్ లుక్ లతో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు.
ప్రీవెడ్డింగ్ ఫోటోల్లో వరుడు వరుణ్ తేజ్ పింక్ షేర్వానీలో పోజులివ్వగా మనోహరంగా కనిపిస్తున్నాడు. మరోవైపు, అతని లేడీ లవ్ లావణ్య గులాబీ రంగు దుపట్టాతో కూడిన మల్టీ కలర్ లెహంగాను ధరించింది. ఎంపిక చేసుకున్న డ్రెస్ కి తగ్గట్టే, భారీ సాంప్రదాయ ఆభరణాలను ఎంచుకుంది. ఈ దుస్తుల్లో అలంకరణలో ఎంతో అందంగా కనిపించింది. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన షేర్ చేసిన మరో ఫోటోలో యూత్ స్టార్ నితిన్ పసుపు కుర్తాలో పోజులిచ్చాడు. మరో ఫోటోల బంచ్ లో నితిన్ భార్య తన మెహందీని ప్రదర్శిస్తోంది.
ఇప్పటికే వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి జంట హల్దీ వేడుక, కాక్టెయిల్ పార్టీని కూడా నిర్వహించారు. సోషల్ మీడియాలో వచ్చిన కాక్టెయిల్ పార్టీ ఫోటోల్లో వరుణ్ తేజ్ అతడి లేడీ లవ్ లావణ్య తెలుపు రంగు దుస్తుల్లో ట్విన్ లుక్ లో కనిపించారు. ప్రఖ్యాత మనీష్ మల్హోత్రా రూపొందించిన క్లాసిక్ వైట్ టక్సేడోలో వరుడు వరుణ్ జెంటిల్మన్ లుక్ లో కనిపించాడు. డోల్స్ & గబ్బానా నుండి పాదరక్షల ఎంపిక రూపాన్ని సంపూర్ణత్వాన్ని తెచ్చింది. వధువు లావణ్య కూడా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన వెండి క్రిస్టల్ అలంకరించబడిన హాల్టర్ గౌనులో ఆశ్చర్యపరిచింది. వైరల్ ఫోటోలలో అల్లు అర్జున్ - రామ్ చరణ్ కూడా కనిపించారు. పెళ్లి వేడుకలతో పాటు, వరుణ్ తేజ్ అభిమానులు తదుపరి `ఆపరేషన్ వాలెంటైన్` మూవీ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెళ్లి తర్వాత వరుణ్ - లావణ్య జంట నెలరోజుల పాటు సుదీర్ఘ హనీమూన్ ట్రిప్ కి వెళ్లనున్నారు.