పిక్ టాక్‌ : టోక్యో రోడ్లపై అందాల హనీ బ్యూటీ

తెలుగు ప్రేక్షకులకు 2016లో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ మెహ్రీన్‌ పిర్జాదా.

Update: 2024-09-13 15:30 GMT

తెలుగు ప్రేక్షకులకు 2016లో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ మెహ్రీన్‌ పిర్జాదా. ఈ అమ్మడు తెలుగు లో మొదటి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. జూనియర్‌ మిల్కీ బ్యూటీ అంటూ కెరీర్‌ ఆరంభంలో గుర్తింపు దక్కించుకుని తమన్నా కు పోటీ అన్నట్లుగా ఫ్యాన్స్ తో ప్రశంసలు దక్కించుకుంది. వరుసగా సినిమాలు చేసిన మెహ్రీన్ కి హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువ పడ్డాయి. దాంతో కెరీర్ కాస్త స్లో అయింది. మరో వైపు వ్యక్తిగతంగా తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా ఆమె సినిమాలు కూడా తగ్గాయి అనేది ఇండస్ట్రీ వర్గాల్లో ఆమె గురించి ఉన్న టాక్‌.


తెలుగు లో ఎఫ్‌ 2, ఎఫ్‌ 3 సినిమాల్లో హనీ ఈజ్ బెస్ట్‌ అంటూ తెగ నవ్వించిన మెహ్రీన్‌ ఆ తర్వాత చేసిన సినిమాలు పెద్దగా ఆడింది లేదు. తెలుగు తో పాటు తమిళ్‌ ఇతర భాషల్లో కూడా మెహ్రీన్ నటించింది. కానీ ఎక్కడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. అయినా కూడా సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలను కంటిన్యూ చేస్తోంది. ఇప్పుడు కాకున్నా భవిష్యత్తులో అయినా మళ్లీ సినిమాలతో బిజీ కాకుండా పోతానా అన్నట్లుగా ఈ అమ్మడు నమ్మకంగా ఉన్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అందుకే సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.


సోషల్‌ మీడియాలో మెహ్రీన్ మరోసారి తన అందమైన ఫోటోలతో వైరల్‌ అవుతోంది. ఈసారి టోక్యో లోని రోడ్ల మీద తిరుగుతూ ఉన్న ఫోటోలతో నెట్టింట సందడి చేస్తోంది. విభిన్నమైన ఔట్ ఫిట్ లో మెహ్రీన్ ఎప్పటిలాగే కన్నుల విందు చేస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎల్లో అండ్‌ గ్రీన్ కాంబోలో ఉన్న డ్రెస్ లో క్లీ వేజ్‌ షో చేస్తూ, థైస్ అందాలను చూపిస్తున్న మెహ్రీన్‌ ఫోటోలు వైరల్‌ అవ్వడంతో నెటిజన్స్‌, ఆమె ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతటి అందగత్తెకు దక్కాల్సిన గుర్తింపు, ఆఫర్లు దక్కడం లేదు అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


ఎప్పుడూ తన విభిన్నమైన ఔట్‌ ఫిట్ తో పాటు, ఆకట్టుకునే మేకోవర్‌, హెయిర్ స్టైల్‌ కారణంగా సోషల్‌ మీడియా ద్వారా అందరికీ దగ్గరగా ఉండే మెహ్రీన్‌ ఇప్పుడు ఈ ఫోటోలతో మరింతగా చేరువ అయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆకట్టుకునే మెహ్రీన్ రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే టోక్యో వారూ అలా చూస్తూ ఉండి పోవాల్సిందే. అంతటి అందాల మెహ్రీన్ కి మరో ఛాన్స్ ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అంటూ ప్రతి ఒక్క ఫ్యాన్‌ కూడా ఎదురు చూస్తున్నారు. మరి మెహ్రీన్ కి మళ్లీ ఇండస్ట్రీలో ఛాన్స్ వచ్చేనా అనేది తెలియాలంటే మరి కొన్నాళ్లు వెయిట్‌ చేయాల్సిందే.

Tags:    

Similar News