నీలిరంగు చీరలో OG బ్యూటీ
నీలిరంగు చీరలోనే చందమామ నువ్వే జాణ అనే సాంగ్ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలోది.
నీలిరంగు చీరలోనే చందమామ నువ్వే జాణ అనే సాంగ్ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలోది. ఈ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అమ్మాయిల అందాన్ని వర్ణించడానికి వారి కట్టు బొట్టు అన్నింటిని కవి హృదయం చూస్తుంది. సౌత్ ఇండియా అంటేనే చీరకట్టుకి పుట్టినిల్లు లాంటిది. ఇక్కడ మగువలు ఎక్కువగా చీరలు ధరించడానికి ఇష్టపడతారు. పురుషులు కూడా చీరలో కనిపించే అమ్మాయిలని ఎక్కువగా చూస్తూ ఉంటారు.
చీరకట్టు ఎవరి దృష్టినైనా ఇట్టే లాగేస్తుంది. అందుకే మన హీరోయిన్స్ కూడా చీరలలో ఎక్కువగా తళుకులీనుతూ ఉంటారు. ప్రస్తుతం తెలుగు తమిళ్ భాషలలో స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తోన్న అందాల భామ ‘ప్రియాంకా అరుళ్ మోహన్’ కూడా చక్కనైన నీలిరంగు చీరలో చందమామలా కట్టిపడేసే రూపంతో ఇన్ స్టాగ్రామ్ లో మెరిసిపోతుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అమ్మడు అందానికి ఈ నీలిరంగు చీర మరింత వన్నె తెచ్చిందని ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె రూపానికి ఆభరణంలా ఆ చీరరంగు ఉందని అంటున్నారు. చురుకైన కళ్ళతో చూపులతోనే ప్రియాంక అందరి హృదయాల్ని కొల్లగొడుతుందని ప్రశంసలు కురిపిస్తున్నారు. కన్నడంలో ‘ఒందు కథే హెల్ల’ అనే సినిమాతో నటిగా తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ రెండో సినిమాని నానితో ‘గ్యాంగ్ లీడర్’ లో చేసింది.
ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయిన వెంటనే శర్వానంద్ కి జోడీగా ‘శ్రీకారం’ మూవీలో ఛాన్స్ అందుకుంది. ఈ చిత్రం పెద్దగా మెప్పించలేదు. అయితే తమిళంలో శివ కార్తికేయన్ కి జోడీగా చేసిన ‘డాక్టర్’ మూవీ సూపర్ హిట్ అయ్యింది. వెంటనే సూర్యతో ‘ఈటీ’ మూవీలో జతకట్టింది. వరుసగా తమిళ్ సినిమాలు చేస్తూ వస్తోన్న ప్రియాంకా అరుళ్ మోహన్ ఈ ఏడాది ‘సరిపోదా శనివారం’ సినిమాతో తెలుగులో కూడా సూపర్ హిట్ అందుకుంది.
తమిళంలో ‘కెప్టెన్ మిల్లర్’, ‘బ్రదర్’ సినిమాలలో ధనుష్, జయం రవికి జోడీగా నటించింది. ఈ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఈ అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఓజీ’ మూవీలో లీడ్ రోల్ చేస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.