మెగాస్టార్ కంటే ముందే గిన్నీస్ రికార్డు వీళ్ల‌దే!

మ‌రి మెగాస్టార్ కంటే ముందు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది ఎవ‌రు? ఎంత‌మంది అంటే ఓసారి వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

Update: 2024-09-23 07:11 GMT

మెగాస్టార్ చిరంజీవి మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది ప్ర‌తిష్టాత్మ‌క పౌర పుర‌స్కారం ప‌ద్మ‌విభూష‌ణ్ ఆయ‌న ఖాతాలో చేరిన వేళ‌... అరుదైన గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు కూడా న‌మోదైంది. 56 చిత్రాలు, 537 పాట‌లు, 24 వేల స్టెప్పుల‌తో అల‌రించినందుకు చిరంజీవికి ఈ రికార్డు ద‌క్కింది. మ‌రి మెగాస్టార్ కంటే ముందు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది ఎవ‌రు? ఎంత‌మంది అంటే ఓసారి వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

ఇందులో హాస్య బ్ర‌హ్మా, కామెడీ కింగ్‌ బ్ర‌హ్మానందం ఒక‌రు. సుధీర్గ కాలం నుంచి హాస్య‌న‌టుడిగా స‌త్తా చాటుతున్న బ్ర‌హ్మానందం ఈ అరుదైన ఘ‌త‌న సాధించారు. 1000 కి పైగా సినిమాల్లో నటించినందుకు 2010లో ఆయ‌న పేరును గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది. అంత‌కు ముందు గాన కోకిల పి. సుశీల 17, 695 సోలో, డ్యూయెట్ మరియు కోరస్ బ్యాక్డ్ పాటలు పాడి రికార్డ్ సృష్టించారు. దీంతో ఆమె గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నారు. దివంగ‌త గాయ‌కుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం పేరిట ఈ రికార్డు ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు పాడారు. అత్య‌ధిక పాట‌లు పాడిన గాయ‌కుడిగా 2001 లో గిన్నీస్ బుక్ లో స్థానం ద‌క్కించుకున్నారు.

లెజెండ‌రీ న‌టి, నిర్మాత‌, ద‌ర్శ‌కురాలు విజ‌య నిర్మల కూడా ఈ ఘ‌న‌త సాధించారు. వివిధ భాష‌ల్లో 42 సినిమాలు చేసిన ఏకైక లేడీ డైరెక్ట‌ర్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో అర్హత సాధించారు. అలాగే 100 భాష‌ల్లో 100 పాట‌లు పాడినందుకు గాను గ‌జ‌ల్ కూడా గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు. అలాగే మూవీ మోఘ‌ల్ డా..రామానాయుడు శ‌తాధిక చిత్రాలు నిర్మించినందుకు గానూ ప్రపంచ రికార్డ్ సృష్టించారు. ఆ ర‌కంగా ఆయ‌న‌కు స్థానం ద‌క్కింది.

ఇంకా అత్య‌ధిక చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వ వ‌హించినందుకు గానూ ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు కూడా గిన్నీస్ పుట‌ల‌కెక్కారు. 150 సినిమాల‌కు ద‌ర్శ‌కుడిగా, 53 చిత్రాల‌కు నిర్మాతగా, 250 చిత్రాల‌కు ర‌చ‌యిత గానూ ప‌నిచేసారు. ఈ లిస్ట్ లో రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తెలుగు సినిమా `బాహుబ‌లి` కూడా ఉంది. `బాహుబలి: ది బిగినింగ్` 50,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో అతిపెద్ద పోస్టర్‌ను రూపొందించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది.

Tags:    

Similar News