టాలీవుడ్ లో ఏ హీరో లెక్క ఎంతంటే? చూస్తే షాక్ అవ్వాల్సిందే!
టాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియాలో ఏ రేంజ్ లో దుమ్ముదులుపుతుందో చెప్పాల్సిన పనిలేదు.
టాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియాలో ఏ రేంజ్ లో దుమ్ముదులుపుతుందో చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ ఇలా అన్ని భాషల్లోనూ తెలుగు సినిమా సత్తా చాటుతుంది. విదేశాల్లోనూ ఇదే దూకుడు చూపిస్తున్నాయి తెలుగు చిత్రాలు. దీంతో స్టార్ హీరోల పారితోషికం కూడా అలాగే కనిపిస్తుంది. 2024 అప్ డేట్ ప్రకారం భారీ పారితోషికం ఎనిమిది మంది హీరోలు తీసుకుంటున్నట్లు కొన్ని ప్రముఖ సర్వే సంస్థల ద్వారా తెలుస్తోంది.
డార్లింగ్ ప్రభాస్ ఇందులో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. `బాహుబలి` తర్వాత అతడి రేంజ్ ఎలా పాకిందన్నది చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే `సలార్ సీజ్ పైర్`, `కల్కి 2898` లో రెండు భారీ విజయాలు ఖాతాలో వేసుకున్నాడు. అతడి మార్కెట్ ఆధారంగా ప్రభాస్ ఒక్కో సినిమాకి 150 నుంచి 200 కోట్లు తీసుకుం టున్నట్లు సమాచారం. ఇక ఆ తర్వాత స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కనిపిస్తున్నాడు. `పుష్ప`తో బాలీవుడ్ మార్కెట్ నే షేక్ చేసాడు. త్వరలో `పుష్ప-2` తో సంచలనం సృష్టించడానికి రెడీ అవుతున్నాడు.
బన్నీ ఇప్పుడు ఒక్కో సినిమాకి 100 నుంచి 130 కోట్ల మధ్యలో పారితోషికం తీసుకుంటున్నాడని సమాచారం. ఆ తర్వాత స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిలిచారు. `ఆర్ ఆర్ ఆర్` విజయంతో గ్లోబల్ స్థాయిలో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. మరో నాలుగు రోజుల్లో దేవర సినిమాతో పాన్ ఇండియాలోకి సోలోగా వస్తున్నాడు. అతడు ఇప్పుడు ఒక్కో సినిమాకి 100 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడుట. తారక్ తో పాటు సమానంగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడుట. 95 నుంచి 100 కోట్ల మధ్యలోనే ఛార్జ్ చేస్తున్నాడుట. ఇతడు `ఆర్ ఆర్ ఆర్` తో పాన్ ఇండియాలో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.
ఇక నాల్గవ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ కనిపిస్తున్నారు. ఇతడు ఇంకా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టేలేదు. అయినా 100 కోట్లకు తక్కువగా తీసుకోవడం లేదుట. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ రేంజ్ ఏ స్థాయికి వెళ్తుందో ఊహకే అందడం లేదు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా 60 నుంచి 100 కోట్ల మధ్య లో ఛార్జ్ చేస్తున్నారుట. ఇతడు ఇంకా పాన్ ఇండియా సినిమాలు చేయలేదు. `హరిహర వీరమల్లు`తో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు. అలాగే `ఓజీ` ని కూడా అదే రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఆరవ స్థానంలో మెగాస్టార్ చిరంజీవి ఉన్నారని సమాచారం. `సైరానరసింహారెడ్డి` తో చిరంజీవి పాన్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చారు . కానీ ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. అయినా దేశం మొత్తం మెగా అభిమానులున్నారు.
ఆక్రేజ్ తో చిరంజీవి కూడా 50 నుంచి 80 కోట్ల మధ్యలో ఛార్జ్ చేస్తున్నారని సమాచారం. ఇక యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియా మార్కెట్ కోసం ప్రయత్నంచేస్తున్నాడు. తొలి ప్రయత్నం `లైగర్` బెడిసి కొట్టింది. ఆ తర్వాత `ఖుషీ` యావరేజ్ గా ఆడింది. ఇతడు 25 నుంచి 40 కోట్ల మధ్యలో పారితోషికం తీసుకుంటున్నాడుట. ఇక ఎనిమిదవ స్థానంలో నటసింహ బాలకృష్ణ ఉన్నారు. ఆయన నటించిన `అఖండ` పాన్ ఇండియా రిలీజ్ కాకపోయినా నార్త్ టీవీ ఛానెల్స్ ద్వారా బాలయ్య పాన్ ఇండియాకి రీచ్ అయ్యారు. హిందుత్వం కాన్సెప్ట్ బాలయ్యకు అక్కడ కలిసొచ్చింది. పైగా బాలయ్య సినిమాలంటే మార్కెట్ లో ఓ బ్రాండ్. ఈ నేపథ్యంలో బాలయ్య కూడా 30 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటున్నారని సర్వేలు చెబుతున్నాయి.