పవర్ఫుల్ లైనప్ తో స్టార్ డైరెక్టర్స్. గ్యాప్ ఇవ్వట్లేదుగా..

90sలో రచయితలు, దర్శకులు సపరేట్ గా ఉండేవారు. రచయితలు కథ రాసి ఇస్తే దర్శకులు దానిని తెరపై ఆవిష్కరించేవారు.

Update: 2024-11-05 05:30 GMT
పవర్ఫుల్ లైనప్ తో స్టార్ డైరెక్టర్స్. గ్యాప్ ఇవ్వట్లేదుగా..
  • whatsapp icon

90sలో రచయితలు, దర్శకులు సపరేట్ గా ఉండేవారు. రచయితలు కథ రాసి ఇస్తే దర్శకులు దానిని తెరపై ఆవిష్కరించేవారు. అందుకే ఏడాదిలో రెండు, మూడు సినిమాలు కూడా అప్పటి దర్శకులు చాలా ఈజీగా చేస్తూ ఉండేవారు. తరువాత దర్శకులే కథలు సిద్ధం చేసుకోవడం మొదలెట్టారు. దీంతో ఒక సినిమా చేసిన తర్వాత రెండో మూవీ కోసం మళ్ళీ కథ సిద్ధం చేసుకోవడం, హీరో కోసం ప్రయత్నించడం జరిగేది. అందుకే సినిమా సినిమాకి ఎక్కువ గ్యాప్ తీసుకునేవారు.

ఇప్పుడు కూడా చాలా వరకు దర్శకులే కథలు రాసుకుంటున్నారు. అయితే ఒకప్పటిలా కాకుండా ఇప్పుడున్న వారిలో స్టార్ దర్శకులు ఒక సినిమా సెట్స్ పైన ఉండగానే మరో కథ కూడా సిద్ధం చేసుకొని వేరొక హీరోకి చెప్పి ఒకే చేయించుకుంటున్నారు. దర్శకుల బ్రాండ్ ని చూసుకొని హీరోలు కూడా స్టార్ డైరెక్టర్స్ చెప్పే కథలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. దీంతో టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ గా ఉన్న వారు రెండు, మూడు సినిమాలు ముందుగానే లైన్ అప్ లో పెట్టుకుంటున్నారు.

స్టార్ డైరెక్టర్ సుకుమార్ ‘పుష్ప 2’ షూటింగ్ చేస్తూ ఉండగానే విజయ్ దేవరకొండతో ఒక సినిమా కన్ఫర్మ్ చేశారు. అలాగే రామ్ చరణ్ తో కూడా ఒక ప్రాజెక్ట్ ఉంటుందని అఫీషియల్ గా ప్రకటించాడు. వీటితో పాటు ‘పుష్ప 3’ కూడా లైన్ అప్ లో ఉంది. అంటే ‘పుష్ప 2’ రిలీజ్ తర్వాత సుకుమార్ ఎక్కువ గ్యాప్ తీసుకునే అవకాశం ఉండకపోవచ్చని అనుకుంటున్నారు.

అలాగే ‘కేజీఎఫ్’ సిరీస్ తో పాన్ ఇండియా దర్శకుడిగా మారిన ప్రశాంత్ నీల్ సలార్ తర్వాత ఎన్టీఆర్ తో మూవీ స్టార్ట్ చేశాడు. ‘సలార్ 2’ మూవీ షూటింగ్ కూడా రీసెంట్ గా స్టార్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ రెండు చిత్రాలు సమాంతరంగా చేయనున్నాడని టాక్. వీటి తర్వాత ‘కేజీఎఫ్ చాప్టర్ 3’ లైన్ లో ఉంది. అలాగే రామ్ చరణ్ తో ఒక ప్రాజెక్ట్ ఒకే చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇవి కాకుండా దిల్ రాజు బ్యానర్ లో ప్రభాస్ తోనే మరో సినిమా చేయాల్సి ఉంది. గతంలో దిల్ రాజు ఈ విషయాన్ని చెప్పారు.

అలాగే యంగ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ తో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఏకంగా నాలుగు సినిమాలు లైన్ లో పెట్టాడు. వాటిలో ‘జై హనుమాన్’, మోక్షజ్ఞ డెబ్యూ మూవీ తన దర్శకత్వంలో తెరకెక్కనున్నాయి. మిగిలిన రెండు తన అసిస్టెంట్స్ తో చేయబోతున్నాడు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీతో మూవీ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. దీని తర్వాత ఎన్టీఆర్ తో ఒక చిత్రం ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇలా చాలా మంది దర్శకుడు కనీసం రెండు సినిమాలు బ్యాక్ అప్ పెట్టుకొని మూవీస్ చేస్తూ ఉండటం విశేషం.

Tags:    

Similar News