నల్లని చీరలో రాశి.. ఎద సోకులతో స్టన్నింగ్

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్స్ గా సక్సెస్ అయిన వారిలో చాలా మంది నార్త్ నుంచి వచ్చినవారే ఉంటారు.

Update: 2024-08-05 05:30 GMT

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్స్ గా సక్సెస్ అయిన వారిలో చాలా మంది నార్త్ నుంచి వచ్చినవారే ఉంటారు. అక్కడ భామలు గ్లామర్ షోకి పెద్దగా అభ్యంతరాలు చెప్పరు. అలాగే అక్కడ బ్యూటీస్ ఎక్కువగా మోడలింగ్ ని కెరియర్ గా ఎంచుకుంటారు. రంగుల ప్రపంచంలో ఎప్పటికప్పుడు అందాల భామలు వారిని వారు కొత్తగా ఆవిష్కరించుకోవాల్సిందే.


ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్ పేజీలపై కనిపించి సందడి చేస్తారు. ఇప్పుడు అందాల భామలకు ఇన్ స్టాగ్రామ్ మంచి వేదికగా మారింది. తమని తాము ఎంత అందంగా ఎలివేట్ చేసుకుంటే సోషల్ మీడియాలో అంత ఫాలోయింగ్ పెరుగుతూ ఉంటుంది. అలాగే దర్శక, నిర్మాతలకి కూడా ఎప్పటికప్పుడు అందాల భామలు తమ గ్లామర్ ఫోటోషూట్ లతో అలెర్ట్ ఇస్తూ ఉంటారు. ఇక అదే తరహాలో ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ రాశిఖన్నా


హిందీలో మద్రాస్ కేఫ్ సినిమాతో రాశిఖన్నా 2013లో నటిగా కెరియర్ స్టార్ట్ చేసింది. తరువాత ఏడాది తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. వెంటనే సందీప్ కిషన్ కి జోడీగా జోరు మూవీలో ఛాన్స్ అందుకుంది. నెక్స్ట్ గోపీచంద్ కి జోడీగా జిల్ చిత్రంలో అవకాశం దక్కించుకుంది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే ఛాన్స్ లేకుండా రాశీఖన్నా వరుస సినిమాలు చేస్తూ వస్తోంది. 2022 వరకు ఆమె జెట్ స్పీడ్ తో మూవీస్ చేసింది.


ఏడాదికి 3 నుంచి 4 సినిమాల వరకు రాశిఖన్నా నుంచి ప్రేక్షకుల ముందుకొచ్చాయి. సాయి ధరమ్ తేజ్ కి జోడీగా సుప్రీమ్ సినిమాలో చేసిన బెల్లం శ్రీదేవి పాత్ర రాశిఖన్నాకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. మంచి ఫన్ జెనరేట్ చేసే పాత్రలని ఆమె తెలుగులో చేసి సక్సెస్ అందుకుంది. సినిమాలలో గ్లామర్ షోతో కూడా అందరిని మెప్పించింది.


ఇదిలా ఉంటే రాశిఖన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంటుంది. తాజాగా స్కై బ్లూ కలర్ చీరలో అదిరిపోయే అందంతో మెరిసిపోతున్న ఫోటోలని రాశిఖన్నా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలని ఏకంగా 1.83 లక్షల మంది లైక్ చేయడం విశేషం. ఈ లుక్స్ లో రాశిఖన్నా సంపంగి పూలలా తన అందంతో కట్టిపడేస్తుందనే మాట నెటిజన్లు నుంచి వినిపిస్తోంది.

Tags:    

Similar News