టాలీవుడ్ లో మ‌ళ్లీ ఆ వైభ‌వం తేబోతున్నారా?

ఒక‌ప్పుడు ఆడియో ఫంక్ష‌న్ల‌లోనే సినిమాలో అన్ని పాట‌ల్ని విడుద‌ల చేసేవారు. సినిమా రిలీజ్ కి- ఆడియో వేడుక‌కు కొంత గ్యాప్ ఉండేది

Update: 2024-04-08 06:35 GMT

ఒక‌ప్పుడు ఆడియో ఫంక్ష‌న్ల‌లోనే సినిమాలో అన్ని పాట‌ల్ని విడుద‌ల చేసేవారు. సినిమా రిలీజ్ కి- ఆడియో వేడుక‌కు కొంత గ్యాప్ ఉండేది. దీంతో పాట‌ల్లో నిజంగా విష‌యం ఉంటే శ్రోత‌ల‌కి చేరేవి. మ్యూజిక‌ల్ గా సినిమా ముందే మంచి విజ‌యం సాధించేది. ఆ ర‌కంగా పాట‌ల కోస‌మైనా ఒక్క‌సారైనా సినిమా చూడాలి అనే ఆడియ‌న్స్ చాలా మంది ఉండేవారు. మ‌రి నేడు ఆడియో ఫంక్ష‌న్ల‌కు బ‌ధులు సినిమా రిలీజ్ ముందు ప్రీరిలీజ్ ఈవెంట్లు అందుబాటులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడిదే మార్కెట్ లో అప్ డేటెడ్ వెర్ష‌న్ గా క‌నిపిస్తుంది.

ఇక పాట‌ల రిలీజ్ అనేది ఒక్కో పాట‌ని శ్రోత‌ల ముందుకు తీసుకొస్తున్నారు. పాట‌కి పాట‌కి మ‌ధ్య కొంత గ్యాప్ తీసుకుని రిలీజ్ చేయ‌డం అన్న‌ది కొంత కాలంగా ట్రెడింగ్ గా మారింది. అయితే ఇలా రిలీజ్ చేయ‌డం వ‌ల్ల పాటలు శ్రోత‌ల‌కు చేర‌డం లేద‌నే వాద‌న కూడా చాలా కాలంగానే వినిపిస్తుంది. పాట రిలీజ్ కి ముందు ప‌లానో రోజు పాట రిలీజ్ చేస్తున్నామ‌ని ఓ పోస్ట‌ర్ వేసి చెబుతున్నారు. ఇలా సినిమాలో ఎన్ని పాట‌లుంటే అన్ని పాట‌లు ఇలాగే రిలీజ్ అవుతున్నాయి. దీంతో అన్ని పాట‌లు ఒకేసారి విని ఏది బాగుంది? ఏది బాగాలేదు? అని నిర్ధారించ‌లేకుండా పోయింది.

ఏ సినిమాలోది ఏ పాటో కూడా తెలియ‌డం లేదు. స‌రిగ్గా ఇదే అభిప్రాయాన్ని ఇటీవ‌ల సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశ‌ర్మ కూడా చెప్పుకొచ్చారు. ఆల్బమ్‌లోని అన్ని పాటలను ఒకేసారి విడుదల చేయడం వల్ల ప్రతి పాటకు మైలేజ్ లభిస్తుందని ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే ఇప్పుడా మాట‌ను ప‌ట్టుకుని ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కీర‌వాణి మ‌ళ్లీ ఓల్డ్ ట్రెండ్ ని తెచ్చేలా క‌నిపిస్తున్నారు. ప్ర‌స్తుతం దిల్ రాజు సొద‌రుడి కుమారుడు అశిష్ న‌టిస్తోన్న `ల‌వ్ మీ` సినిమా కోసం కీర‌వాణి మ్యూజిక్ అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాకి సంబంధించి ఆడియో వేడుక చేసే ప్లాన్ లో కీర‌వాణి ఉన్న‌ట్లు వినిపిస్తుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి లవ్ మీ- ఇఫ్ యు డేర్ ఫస్ట్ సింగిల్ విడుదలైంది. అయితే మిగిలిన పాట‌ల‌న్నింటిని ఏప్రిల్ 9న ఓ కార్య‌క్ర‌మంలో రిలీజ్ చేస్తున్న‌ట్లు తెలిపారు. దీంతో మ‌ళ్లీ గ‌త వైభ‌వం తిరిగి రావ‌డం ఖాయ‌మ‌ని కొంద‌రు భావిస్తున్నారు. మ‌రి ఈవెంట్ అలా జ‌రుగుతుందో? లేక ఆడియో వేడుక‌కి బ‌ధులుగా అప్డేడేట్ గా కొత్త ట్రెండ్ ని ప‌రిచ‌యం చేస్తారా? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News