పక్కోడి కంటే దూరమైనా పరాయోడు బెటర్!
తెలుగు పరిశ్రమ అలాంటి వాళ్లని ఎప్పుడూ స్వాగతిస్తుంది. లాంచ్ అయిన కోలీవుడ్ హీరోల విషయంలో అంతే ప్రేమని చూపించింది
పక్కోడి కంటే కొన్ని సార్లు దూరమైనా పరాయి వాడే బెటర్ అనుకుంటాం. ఇప్పుడు టాలీవుడ్ ఓ పరిశ్రమ విషయంలో అలాగే అనుకోవాలేమో! తెలుగు సినిమా పాన్ ఇండియా క్రేజ్ చూసి కోలీవుడ్.. బాలీవుడ్ నటులు టాలీవుడ్ పై ఆసక్తి చూపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వరుసలో కోలీవుడ్ హీరోలు ముందున్నారు. ఎప్పుడూ టాలీవుడ్ వైపు చూడని కొందరు హీరోలు హఠాత్తుగా ఇక్కడకొచ్చి సినిమాలు చేయడం ప్రారంభించారు.
తెలుగు పరిశ్రమ అలాంటి వాళ్లని ఎప్పుడూ స్వాగతిస్తుంది. లాంచ్ అయిన కోలీవుడ్ హీరోల విషయంలో అంతే ప్రేమని చూపించింది. కానీ ఆ ప్రేమని ఆ హీరోలు తిరిగి చూపించడం లో ఫెయిలైనట్లు కనిపిస్తుంది. ఈ విషయంలో కోలీవుడ్ తో పొల్చితే బాలీవుడ్ నటులే ఎంతో ఉత్తమం అనిపిస్తుంది. ఇప్పటివరకూ ఏ కోలీవుడ్ హీరో కూడా ఫలానా టాలీవుడ్ హీరోతో మంచి రిలేషన్ షిప్ ఉందని ఎక్కడా ప్రకటించింది లేదు.
మరి నిజంగా లేక ప్రకటించలేదా? ఉన్నా బయటకు లేనట్లే వ్యవహరిస్తున్నారా? అన్నది వాళ్ల అంతర్గతానికే వదిలేయాలి. ఇక కన్నడ...మలయాళ నటులు తెలుగు పరిశ్రమ అంటే సొంత భావంతోనే ఉంటారు. తెలుగు నటులందరితో మంచి రిలేషన్ షిప్ ని కొనసాగిస్తారు. బాలీవుడ్ లో కూడా ఇలాంటి హీరోలు కొందరున్నారు. అమితాబచ్చన్..సల్మాన్ ఖాన్... అమీర్ ఖాన్ లాంటి నటులకు ఇక్కడ మంచి స్నేహితులున్నారు.
ఈ లిస్టులో ఇప్పుడు షారుక్ ఖాన్ కూడా చేరారు. మహేష్ తో కలిసి పనిచేయాలి అన్న మనసులో కోర్కెను ఇన్నాళ్లకు బయట పెట్టారు. ఇంత కాలం ఆయన ఓపెన్ కాలేదు గానీ...రీసెంట్ ఓపెన్ అవ్వడంతో చివరికి ఆయన కూడా మారాడు అనిపించింది. ఇక పక్కనున్న కోలీవుడ్ లో సూర్య..కార్తీ..ధనుష్ లాంటి కొంత మంది నటులు తప్పా! చాలా మంది తెలుగు సినిమా గురించి గానీ..ఇక్కడ నటుల గురించి గానీ మాట్లాడింది లేదు.
ఈ విషయంలో కోలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్. ఒకప్పుడు బాలీవుడ్ కూడా టాలీవుడ్ ని చిన్న చూపు చూసింది. కానీ పరిశ్రమ ఎదుగుదల చూసి చేసే విధానం మార్చుకుంది. కానీ కోలీవుడ్ మాత్రం ఇంకా మూస పద్దతిలోనే కనిపిస్తుంది.