బడ్జెట్ దెబ్బతో దర్శక నిర్మాతకు పెద్ద గొడవ!
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి సహజంగానే ఉంటాయి. అయితే సక్సెస్ వచ్చినపుడు నిర్మాతలు దర్శకులకి ఖరీదైన బహుమతులు ఇస్తారు
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి సహజంగానే ఉంటాయి. అయితే సక్సెస్ వచ్చినపుడు నిర్మాతలు దర్శకులకి ఖరీదైన బహుమతులు ఇస్తారు. అదే సినిమాలు ఫెయిల్ అయితే మాత్రం బ్లేమ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. నిర్మాత బడ్జెట్ విషయంలో సహకరించలేదని దర్శకులు ఆరోపణలు చేస్తూ ఉంటారు. దర్శకుడిని నమ్మి అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టిన సరిగా తీయలేకపోయాడని నిర్మాతలు ఆరోపణలు చేస్తూ ఉంటారు.
కొన్ని సినిమాల విషయంలో హీరోలు కూడా దర్శకుల మీదనే విమర్శలు చేస్తూ ఉంటారు. తరుచుగా ఇలాంటి సంఘటనలు ఇండస్ట్రీలో చూస్తూ ఉంటాం. తాజాగా అలాంటి సంఘటన ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సూపర్ హిట్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన దర్శకుడు తరువాత స్టార్ హీరోలతో మూవీస్ చేశాడు.
అయితే ఒక్క డిజాస్టర్ తో చాలా కాలం మూవీస్ కి దూరమయ్యాడు. మరల రీమేక్ సినిమాతో హిట్ కొట్టి తాజాగా ఓ బడా నిర్మాతతో కొత్త హీరో మీద భారీ బడ్జెట్ పెట్టి యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో మూవీ చేశారు. హీరో నిర్మాత బంధువు కావడంతో సదరు ప్రొడ్యూసర్ ఖర్చుకి వెనుకాడకుండా బడ్జెట్ పెట్టారు. రెండు భాగాలుగా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ సినిమా ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేసింది. కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకాన్ని ఇచ్చింది. దీంతో డిస్టిబ్యూటర్స్ కూడా మూవీ హక్కులు కొనడానికి ముందుకొచ్చారు. దీంతో ఈ చిత్రంతో భారీ లాభాలు వస్తాయని నిర్మాత కూడా ఎక్స్ పెక్ట్ చేశాడు. అయితే అనూహ్యంగా రిలీజ్ తర్వాత ఈ మూవీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకొని నిర్మాతకి నష్టాలు తీసుకొచ్చింది.
ఇంకా ఆ మూవీ షాక్ నుంచి నిర్మాత కోలుకోకుండానే దర్శకుడు అతన్ని కలిసి పార్ట్ 2 గురించి చర్చించారంట. దీంతో నిర్మాతకి కోపం వచ్చి మూవీ స్క్రీన్ ప్లేలో తప్పులు ఎత్తి చూపించారంట. అయితే సదరు దర్శకుడు కూడా నిర్మాతకి రివర్స్ అయ్యారంట. సినిమాకి వద్దని చెప్పిన అవసరానికి మించి బడ్జెట్ పెట్టి సంబంధం లేకుండా గ్రాండ్ నెస్ కోసం స్టోరీ డీవియేట్ కావడానికి మీరే కారణం అయ్యారని దర్శకుడు అన్నారంట. దీంతో ఇప్పుడు దర్శక, నిర్మాతల మధ్య ఈ సినిమాపైన వివాదం నడుస్తోందనే టాక్ ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తోంది.