మాస్ టైగర్ తో బాలయ్య సమరం.. బ్రేక్ చేయగలడా?
తెలుగు చిత్ర సీమలో ఓ సినిమా విజయంలో సెంటిమెంట్, ట్రాక్ రికార్డ్ కీలక పాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసింది
తెలుగు చిత్ర సీమలో ఓ సినిమా విజయంలో సెంటిమెంట్, ట్రాక్ రికార్డ్ కీలక పాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసింది. కానీ ప్రతీసారి ఇదే వర్కౌట్ అవుతుందని చెప్పలేం. అయితే పండగ సీజన్లో సాధారణంగా ఇద్దరు హీరోలు ఒకేసారి బరిలోకి దిగినప్పుడు ఎవరు పైచేయి సాధిస్తారన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఉంటుంది. అలా ఈ సారి దసరా బరిలో నందమూరి నటసింహం బాలయ్య - మాస్ మహారాజా రవితేజ పోటీ పడటం ఉత్కంఠతకు దారీ తీసింది.
ఈ దసరా పండగకు నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నా.. భగవంత్ కేసరి వర్సెస్ టైగర్ నాగేశ్వరరావు పోటీగానే ప్రేక్షకులు చూస్తున్నారు. వీరిద్దరు గతంలో పోటీపడ్డ ట్రాక్ రికార్డ్ వివరాలను బయటకు తీసి తిరగేస్తున్నారు.
2008 సంక్రాంతికి బాలయ్య ఒక్క మగాడుతో వచ్చి డీలా పడగా రవితేజ కృష్ణ చిత్రంతో వచ్చి భారీ హిట్‌ను అందుకున్నారు. 2009లో బాలయ్య మిత్రుడుతో బోల్తా కొట్టగా.. రవితేజ కిక్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మూడో సారి 2011 సంక్రాంతికి పరమవీర చక్రతో పలకరించిన బాలయ్యకు నిరాశ ఎదురవ్వగా.. మిరపకాయతో వచ్చిన మాస్ మాహారాజా బిగ్ సక్సెస్ అందుకున్నారు. అలా మూడు సార్లు రవితేజనే పైచేయి సాధించారు.
దీంతో ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారన్న ఆసక్తి సహజంగానే ఎక్కువగా ఉంది. అయితే ఈ సారి భగవంత్ కేసరి - టైగర్ నాగేశ్వరరావు రెండు సినిమాల ట్రైలర్స్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకున్నాయి. రెండు చిత్రాల ట్రైలర్లు ప్రామిసింగ్‌గా ఉండటంతో సినిమాలపై అంచనాలను పెంచేశాయి.
టైగర్ నాగేశ్వరరావు టెక్నికల్‌గా స్కేల్, విజన్ పరంగా హైస్టాండర్డ్స్‌లో కనిపిస్తోంది. భగవంత్ కేసరి ఎమోషన్స్, సెంటిమెంట్, అదరిపోయే డైలాగ్‌లతో పర్ఫెక్ట్ ఫెస్టివల్ ఎంటర్టైనర్గా ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఈ సారి రెండు చిత్రాలు మంచి హిట్ అందుకుంటాయని అనిపిస్తోంది. అయితే బాలయ్య ఫ్యాన్స్ మాత్రం భగవంత్ కేసరియే ఈ సారిపై చేయి సాధిస్తుందని, గత మూడు సార్ల ఓటమికి బాలయ్య రివెంజ్ తీర్చుకుంటారని అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో...