టాలీవుడ్ ఊర మాస్ దర్శకుడితో సూర్య!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తెలుగులో స్ట్రైట్ మూవీ చేయడం కోసం చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నాడు

Update: 2023-09-22 03:55 GMT

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తెలుగులో స్ట్రైట్ మూవీ చేయడం కోసం చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అనుకున్న స్థాయిలో ఎవరూ సెట్ కావడం లేదు. అయితే తమిళంలో సూర్య చేస్తోన్న ప్రతి మూవీ తెలుగులో కూడా డబ్ అవుతూ సూపర్ హిట్ అవుతోంది. ఆయన నుంచి వచ్చిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్ చిత్రాలు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.

ప్రస్తుతం సూర్య, శివ దర్శకత్వంలో కంగువ మూవీ పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై అంచనాలు కూడా గట్టిగానే ఉన్నాయి. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇదిలా ఉంటే సూర్య స్ట్రైట్ తెలుగు మూవీ కోసం డైరెక్టర్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. మాస్ చిత్రాల దర్శకుడిగా తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న బోయపాటి శ్రీనుతో సూర్య మూవీ చేయనున్నారంట.

ప్రస్తుతం బోయపాటి రామ్ పోతినేని దర్శకత్వంలో చేసిన స్కంద మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. సెప్టె 28న ఈ మూవీ రిలీజ్ కానుంది. హై ఎక్స్ పెక్టేషన్స్ మధ్యనే ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకి వస్తోంది. దీని తర్వాత బోయపాటి శ్రీను అఖండ సీక్వెల్ బాలకృష్ణతో చేయాలని అనుకున్నారు. అయితే బాలయ్య ప్రస్తుతం ఏపీ రాజకీయ వ్యవహారాలలో బిజీగా ఉన్నారు.

బాబీ దర్శకత్వంలో ఇప్పటికే సినిమా కమిట్ అయ్యి ఉన్నారు. ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది ఇంకా క్లారిటీ లేదు. దీని తర్వాత బోయపాటి దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. అయితే దానికి చాలా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బోయపాటి శ్రీను సూర్యతో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నారంట. ఇప్పటికే స్టోరీ నేరేషన్ కూడా అయిపోయిందనే టాక్ వినిపిస్తోంది.

సూర్యతో కూడా తన స్టైల్ లో సాగే పవర్ ఫుల్ మాస్, యాక్షన్ చిత్రాన్ని బోయపాటి చేసే అవకాశం కనిపిస్తోంది. బోయపాటి స్టైల్ కోలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త కాబట్టి ఆదరించే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ పై స్కంద మూవీ రిలీజ్ తర్వాత అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News