మహేశ్ తోనే పోటీకి సిద్ధమైన చిన్న హీరో..

దీంతో మహేశ్ బాబు సినిమాతో పోటీ పడేంత ధైర్యం హనుమాన్ మూవీటీమ్ కు ఎలా వచ్చిందన్న ఆలోచనలు వస్తున్నాయి

Update: 2023-09-18 12:00 GMT

వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా మారనుంది. ఆ సమయంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం, యంగ్ హీరో తేజ సజ్జ హనుమాన్​, రవితేజ ఈగల్, నాగార్జున నా సామీ రంగ, విజయ్ దేవరకొండ వీడీ 13 చిత్రాలు వచ్చేందుకు రెడీ అయ్యాయి. అయితే సంక్రాంతికి ఇంకా మూడు నెలల సమయం ఉండడంతో వీటిలో ఏ చిత్రాలు ఆ సమయానికి రేసులో ఉంటాయో, ఏవీ తప్పుకుంటాయో తెలీదు.

వీటిలో హనుమాన్ చిత్రం తప్ప మిగతా వన్నీ పెద్ద హీరోల చిత్రాలే కావడం విశేషం. దీంతో హనుమాన్ చిత్రం ఈ బడా చిత్రాలతో పోటీని తట్టుకుని అప్పుడే వస్తుందా అన్న డౌట్ కాస్త ఉండేది. కానీ తాజాగా వినాయక చవితి సందర్భంగా హనుమాన్ చిత్రం సంక్రాంతికే జనవరి 12న రానుందంటూ మరోసారి మూవీటీమ్ కన్ఫామ్ చేసింది. అయితే అదే జనవరి 12 గుంటూరు కారం కూడా రానుందంటూ ఇప్పటికే సదరు మూవీటీమ్.. పలుసార్లు క్లారిటీ కూడా ఇచ్చింది.

దీంతో మహేశ్ బాబు సినిమాతో పోటీ పడేంత ధైర్యం హనుమాన్ మూవీటీమ్ కు ఎలా వచ్చిందన్న ఆలోచనలు వస్తున్నాయి. మహేశ్ లాంటి బిగ్ స్టార్ తో ఓ చిన్న హీరో పోటీపడేందుకు రెడీ అవ్వడం అంటే ధైర్యమనే చెప్పాలి. లేదంటే ఒకవేళ.. అసలే షూటింగ్ విషయంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇప్పుడిప్పుడే చిత్రీకరణ జరుపుకుంటున్న గుంటూరు కారం వాయిదా పడుతుందనే ఆలోచన ఏమైనా హనుమాన్ మూవీటీమ్ లో కలిగిందా అన్న డౌట్స్ వస్తున్నాయి.

అందుకే ముందుగానే గుంటూరు కారం రిలీజ్ డేట్ పై కర్ఛీఫ్ వేసుకునేందుకు ఈ రిలీజ్ డేట్ ను ప్రకటించిందా? లేదంటే తమ సినిమా కంటెంట్ పై ఉన్న నమ్మకం, ఇప్పటికే టీజర్ కు భారీ స్థాయిలో విశేష స్పందన రావడంతో ఈ ధైర్యం చేస్తుండొచ్చు. పైగా డివోషనల్ కాన్సెప్ట్ తో రాబోయే చిత్రం. చెప్పలేం.. ఏదైనా కావొచ్చు. మహేశ్ సినిమాకు తమ కంటెంట్ పై ఉన్న నమ్మకంతో హనుమాన్ సినిమా సవాల్ విసురుతోందనే చెప్పాలి.

ఏదేమైనా ఇప్పుడీ హనుమాన్ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేయనున్నారు. దేశమంతా ప్రమోషన్స్ నిర్వహించుకునేందుకు మూవీటీమ్ కు ఇప్పుడు కావాల్సినంత సమయమైతే దొరికింది. ఇక ఈ హనుమాన్ చిత్రాన్ని సూపర్ హీరో మూవీగా తెరకెక్కిస్తున్నారు. అ, కల్కి, జాంబి రెడ్డి వంటి చిత్రాలతో మంచి హిట్ అందుకున్న యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు.

Tags:    

Similar News