'శనివారం'.. 'మంగళవారం'..ఏందో ఈ శుక్రవారం గోల!
టైటిల్ క్యాచీగా ఉండటంతో అందరకీ బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడీ వారం టైటిల్ నుంచే మరో దర్శకుడు కాపీ కొట్టినట్లు తెలుస్తోంది
వారం పేరిట టైటిల్స్ పెరుగుతున్నాయా? అంటే అవుననే తెలుస్తోంది. ఇప్పటికే పాయల్ రాజ్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి 'మంగళవారం' అనే సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. మంగళవారం పేరుతో ఓ బూతు సామెత ఉండటంతో! అంతా అదే అర్ధం వస్తుందని..ఇదో బోల్డ్ సినిమా అని తెగ ప్రచారం జరుగుతోంది. అది మార్కెట్ లో ఎంతగా ప్రభావం చూపిందంటే? నేరుగా సీన్ లోకి దర్శకుడు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
అందరూ అనుకుంటున్న బూతు సామెతకు ఈ టైటిల్‌కు ఏ సంబంధం లేదని అజయ్ స్పష్టత ఇచ్చాడు. సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారారికి..తమ సినిమా కథకి ఎలాంటి సంబంధం లేదని ఇదో డీసెంట్ స్టోరీ అన్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ చిత్రానికి ఇది యాప్ట్ టైటిల్ అని.. రేప్పొద్దున సినిమా చూసినపుడు అది ప్రేక్షకులకు బాగా అర్థమవుతుందని అజయ్ క్లారిటీ ఇచ్చాడు. అయితే మంగళవారం టైటిల్ తో సినిమా జనాల్లోకి వాయు వేగంతో వెళ్లిపోయింది.
టైటిల్ క్యాచీగా ఉండటంతో అందరకీ బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడీ వారం టైటిల్ నుంచే మరో దర్శకుడు కాపీ కొట్టినట్లు తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని కథనాకుడిగా వివేక్ ఆత్రేయ 'సరిపోదా శనివారం' అంటున్నావు. అవును ఆయన కొత్త సినిమా టైటిల్ ఇదే. మరి ఇది ఏ జానర్ సినిమా అన్నది తెలియాలి. పోస్టర్ మాత్రం యాక్షన హీరోలా హైలైట్ చేస్తుంది. కానీ టైటిల్ కి ...పోస్టర్ కి ఎలాంటి సంబంధం కనిపించలేదు.
ఇదే దర్శకుడు ఇంతకు ముందు అంటే సుందరానికి అనే డిఫరెంట్ టైటిల్ తో ఓ సినిమా చేసాడు. అది అట్టర్ ప్లాప్ అయింది. అయినా నాని నమ్మకంతో మరో అవకాశం ఇచ్చాడు. మరి ఈ శనివారం కథ ఏంటో తెలియాలి. అయితే ఈ టైటిల్ ని మంగళవారం టైటిల్ ని స్పూర్తిగా తీసుకుని..తన సినిమాకి వారం పేరు వచ్చేలా పెట్టాడని సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి. మరి ఈ టైటిల్ వెనుక కథ ఏంటి? స్టోరీని బట్టి అలా పెట్టాల్సి వచ్చిందా? ఇంకా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏదైనా ఉందా? అన్నది తెలియాలి. కారణాలు ఏవైనా వరుసగా వారం పేరుతో టైటిల్స్ తెరపైకి రావడం ఆసక్తికరం. ఏ వారం పేరుతో వచ్చిన రిలీజ్ మాత్రం శుక్రవారం కాబట్టి! కాసుల వర్షం కురుస్తుందా? లేదా? అన్నది ముఖ్యం.