ఆ మార్కెట్ కోసం తెలుగు హీరోల జోరు!
అందుకు స్టార్ హీరోలు నుంచి చిన్న హీరోల వరకు అందరూ తమ చిత్రాలను వివిధ రకాలుగా ప్రమోషన్లు నిర్వహిస్తుంటారు
కంటెంట్ వీక్‌గా ఉన్నపుడే ప్రమోషన్ పీక్స్‌లో ఉంటాదనేది ఒకప్పుడు మాట! ఇప్పుడు కంటెంట్, ప్రమోషన్ రెండూ పీక్‌లోనే ఉండాలి.. ఇదిప్పుడు మాట! పిండి కొద్దీ రొట్టె అంతే! ఇక్కడ పిండి అంటే ప్రమోషన్.. రొట్టె అంటే సినిమా! కొన్నిసార్లు కంటెంట్ వీక్‌గానే ఉండొచ్చు.. కానీ దాన్ని ప్రమోట్ చేసుకునే పద్దతి సరిగ్గా ఉంటే వీక్ ప్రాడక్ట్ కూడా పీక్‌లోకి వెళ్తుంది. రొటీన్ సినిమా సైతం మంచి ప్రమోషన్‌తో సూపర్ హిట్టైన సందర్భాలు చాలానే ఉన్నాయి. కంటెంట్ అద్భుతంగా ఉండి ప్రమోషన్స్ వీక్‌గా ఉంటే సినిమా కలెక్షన్స్ కూడా అలాగే వస్తున్నాయి.
అందుకు స్టార్ హీరోలు నుంచి చిన్న హీరోల వరకు అందరూ తమ చిత్రాలను వివిధ రకాలుగా ప్రమోషన్లు నిర్వహిస్తుంటారు. చిత్ర యానిట్ తో కలిపి స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. సోలోగా కూడా మీడియాతో సినిమా విషయాలను పంచుకుంటుంటారు. టీవీ రియాలిటీ షోల్లో మెరుస్తుంటారు. సోషల్ మీడియాలో చిట్ చాట్స కూడా చేస్తుంటారు. అయితే సినీ వర్గాల్లో ఇప్పుడు ఓ కొత్త కహానీ వినిపిస్తోంది.
అమెరికాలోని డల్సాస్.. ఈ ఇప్పుడు తెలుగు సినిమాలకు ప్రమోషన్ డిస్టినేషన్ గా మారిందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తెలుగు హీరోలు, దర్శకులు అక్కడి వెళ్లి మరీ ప్రమోషన్లు చేస్తున్నారు. తమ సినిమాలకు సంబంధించి చిన్న విషయాలను షేర్ చేసుకుటున్నారు.
ఈ వారంలో డల్లాస్ మూడు సినిమాల ప్రమోషన్లకు వేదికైంది. శ్లోకా ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంలో హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే జరిగింది. ప్రీమియర్ షో రోజు గ్రాండ్ గా ఈవెంట్ ను జరుపుకుంది చిత్రయూనిట్.
నేచురల్ స్టార్ నాని తన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న సినిమా ప్రమోట్ చేసేందుకు శనివారం డల్లాస్ చేరుకున్నారు. ఇప్పటికే సినిమా విడుదలైనా.. వసూళ్లు పెంచేందుకు అక్కడి ఫ్యాన్స్ తో ముచ్చటించనున్నారు. మరోవైపు, యానిమల్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న దర్శఖకు సందీప్ రెడ్డి వంగా డల్లాస్ వెళ్లనున్నారట.
అయితే డల్లాస్ లో ప్రమోషన్ మ్యానియా ఇది ప్రారంభం మాత్రమే సినీ పండితులు అంటున్నారు. 2024లో పెద్ద ఎత్తున నటీనటులు.. అక్కడ పర్యటించి ప్రమోట్ చేయనున్నారని చెబుతున్నారు. ఇక నిర్మాతలకు ఈ వ్యవహారం కాస్త వ్యయమే అయినా ప్రమోషన్ల వల్ల లాభం ఉంటుందని అంటున్నారు.