టాలీవుడ్ స్టార్స్.. చివరి సినిమాల రిజల్ట్ ఏంటో తెలుసా?

మన స్టార్ హీరోలు చేసిన చివరి చిత్రాల ఫలితాలు ఓ సారి చూసుకుంటే డార్లింగ్ ప్రభాస్ సలార్ మూవీ ఎబౌవ్ ఏవరేజ్ అయ్యింది. బ్రేక్ ఈవెన్ అయిన కూడా భారీ లాభాలు మాత్రం రాలేదు.

Update: 2024-02-04 04:41 GMT

టాలీవుడ్ లో టైర్ 1 హీరోలు అందరూ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోయారు. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమాతో పాన్ వరల్డ్ ని టచ్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఓజీతో పాన్ ఇండియా జోన్ లోకి వెళ్ళిపోతున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డితో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. విశ్వంభర సాలిడ్ సక్సెస్ తో ఆయన ఇమేజ్ అమాంతం పెరుగుతుందని భావిస్తున్నారు.

సీనియర్ హీరోలైన బాలకృష్ణ వరుస హిట్ లతో మంచి జోరు మీద ఉన్నారు. త్వరలో పాన్ ఇండియా జాబితాలోకి వచ్చే అవకాశం ఉంది. విక్టరీ వెంకటేష్ కూడా రెగ్యులర్ కి భిన్నంగా కొత్త కథలతో జర్నీ చేస్తున్నారు. కింగ్ నాగార్జున తనలో ఆడియన్స్ కి నచ్చే రొమాంటిక్, మాస్ హీరోని ఎక్కువగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ పాన్ ఇండియా బ్రాండ్ పెంచుకుంటున్నారు. అందులో భాగంగా బ్రహ్మాస్త్రలో చేశారు. ఇప్పుడు ధనుష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

మన స్టార్ హీరోలు చేసిన చివరి చిత్రాల ఫలితాలు ఓ సారి చూసుకుంటే డార్లింగ్ ప్రభాస్ సలార్ మూవీ ఎబౌవ్ ఏవరేజ్ అయ్యింది. బ్రేక్ ఈవెన్ అయిన కూడా భారీ లాభాలు మాత్రం రాలేదు. అల్లు అర్జున్ పుష్ప మూవీ తెలుగులో ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. హిందీలో మాత్రం కమర్షియల్ సూపర్ హిట్ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ సాధించి ఎబౌవ్ ఏవరేజ్ గా నిలిచింది.

రామ్ చరణ్ చివరిగా వచ్చిన సినిమా ఆచార్య డిజాస్టర్ అయ్యింది. ఎన్ఠీఆర్ ఆర్ఆర్ఆర్ లో చివరిగా కనిపించారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, తేజ్ తో కలిసి చివరిగా బ్రో - ది అవతార్ మూవీ చేశాడు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. చిరంజీవి భోళా శంకర్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. బాలకృష్ణ చివరిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరితో రాగా అది హిట్ బొమ్మగా నిలిచింది.

వెంకటేష్ సైంధవ్ మూవీ డిజాస్టర్ అయ్యింది. కింగ్ నాగార్జున నా సామిరంగా మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. రవితేజ టైగర్ నాగేశ్వరరావు డిజాస్టర్ అయ్యింది. నాని చేసిన హాయ్ నాన్న మూవీ హిట్ టాక్ దక్కించుకుంది. ఇప్పుడు ఈ స్టార్స్ అందరూ నెక్స్ట్ మూవీస్ విషయంలో పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నారు. మరి వాటిలో ఎన్ని సక్సెస్ అవుతాయనేది చూడాలి.


Tags:    

Similar News