త్రిధా చౌధరీ.. స్టన్నింగ్ లుక్ తో కిర్రాక్ పోజ్!

ఆ తర్వాత మరో రెండు తెలుగు సినిమాల్లో నటించినా సరైన హిట్ కొట్టలేకపోయింది.

Update: 2024-12-02 22:30 GMT

త్రిధా చౌధరీ.. ఈ బ్యూటీ ఎవరా అని ఆలోచిస్తున్నారా? యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ సూర్య వర్సెస్ సూర్య మూవీతో టాలీవుడ్ సినీ ప్రియులకు పరిచయమయ్యారు ఈ బెంగాలీ ముద్దుగుమ్మ. ఆ సినిమా మోస్తరు విజయం సాధించినప్పటికీ తన అందం, అభినయంతో అందరినీ అలరించింది. ఆ తర్వాత మరో రెండు తెలుగు సినిమాల్లో నటించినా సరైన హిట్ కొట్టలేకపోయింది.


పదేళ్ల క్రితం బెంగాలీ మూవీతో తన యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన త్రిధా.. అక్కడి చిత్రాల్లో అడపాదడపా కనిపిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత తెలుగు ఆడియన్స్ కు పలకరించిన అమ్మడు.. ఆ తర్వాత చిన్న గ్యాప్ లో సందీప్ కిషన్ గా మంజుల తెరకెక్కించిన మనసుకు నచ్చింది చిత్రంలో యాక్ట్ చేశారు. కానీ సక్సెస్ ను అందుకోలేకపోయారు.

ఆ తర్వాత 7, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి చిత్రాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. రెండు సినిమాల్లోనూ తన యాక్టింగ్ తో మెప్పించినా.. కావాల్సిన హిట్స్ ను సొంతం చేసుకోలేకపోయింది. గత నాలుగేళ్లుగా ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. కానీ సోషల్ మీడియా ద్వారా టాలీవుడ్ ఫ్యాన్స్ ను ఎప్పటికప్పుడు పలకరిస్తుంటారు త్రిధా.

సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ కొత్త కొత్త పిక్స్ పోస్ట్ చేస్తోంది. వేరే లెవెల్ లో అందాలు ఆరబోసి మైమరపిస్తుంటారు. వెకేషన్స్ కు వెళ్తూ అక్కడి పిక్చర్స్ ను పంచుకుంటూ ఉంటోంది. బికినీల్లో స్కిన్ షోతో ఫిదా చేస్తోంది. నెట్టింట ఎప్పటికప్పుడు సెగలు రేపుతుంటారు త్రిధా చౌధరీ. తాజాగా కొత్త పిక్ ను పోస్ట్ చేశారు త్రిధా. అందులో బ్లాక్ కలర్ ప్యాంట్, ఎల్లో కలర్ ఇన్నర్ వేసుకుని సెల్ఫీ తీసుకుని దర్శనమిచ్చింది. తన స్టన్నింగ్ అందాలతో మైండ్ బ్లాక్ చేసేసింది.

సొగసుతో ఫిదా చేసిన త్రిధా.. తన నవ్వుతో ఆకట్టుకుంది. ప్రస్తుతం త్రిధా కొత్త పిక్ తెగ చక్కర్లు కొడుతోంది. స్టన్నింగ్ బాడీ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గ్లామరస్ క్వీన్ అంటూ కొనియాడుతున్నారు. సూపర్ ఫోటో అని చెబుతూ.. తెగ అట్రాక్ట్ అవుతున్నామని అంటున్నారు. క్యాప్షన్ కూడా క్రేజీగా ఉందని చెబుతున్నారు.

Tags:    

Similar News