స్టార్ హీరోయిన్ ని భరించలేం అంటున్న నిర్మాతలు..!
అందులో ఒకటి స్టార్ హీరో సినిమా కాగా అందులో నటించేందుకు త్రిష భారీ రెమ్యునరేషన్ అందుకుందని తెలుస్తుంది.
రోజుకొక కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్నా కూడా సౌత్ సినిమాల్లో సీనియర్ హీరోయిన్స్ కి ఇంకా డిమాండ్ ఉంటూనే వస్తుంది. ముఖ్యంగా రెండు దశాబ్దాల పాటు కెరీర్ కొనసాగిస్తున్న భామలకు అనూహ్యంగా ఈమధ్య సూపర్ క్రేజ్ ఏర్పడింది. దాదాపు 20 ఏళ్లుగా సౌత్ ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్న భామలు ఇప్పటికీ మంచి ఫాం కొనసాగిస్తున్నారు. అలాంటి హీరోయిన్స్ గురించి చెప్పుకుంటే ముందు వరుసలో ఉంటుంది చెన్నై చిన్నది త్రిష కృష్ణన్. నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అమ్మడు ఇప్పటికీ తన ఫాం కొనసాగిస్తుంది.
తెలుగుతో పాటు తమిళంలో కూడా త్రిష తన స్టార్ డం కొనసాగిస్తుంది. కెరీర్ మధ్యలో కొన్నాళ్లు వెనక పడినట్టు అనిపించిన మళ్లీ అమ్మడు తిరిగి ఫాం లోకి రావడం ఆమె ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. ముఖ్యంగా చెన్నైలో త్రిష సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఈమధ్య అక్కడ వరుస ఛాన్స్ లు అందుకుంటున్న త్రిష డిమాండ్ ఒక రేంజ్ లో ఉంది. కోలీవుడ్ లో త్రిష ఫాం చూసిన తెలుగు మేకర్స్ ఆమెకు ఇక్కడ అవకాశాలు ఇస్తున్నారు.
ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తున్న త్రిష ఆ సినిమా తర్వాత మరో రెండు క్రేజీ ఆఫర్లు అందుకున్నట్టు తెలుస్తుంది. అందులో ఒకటి స్టార్ హీరో సినిమా కాగా అందులో నటించేందుకు త్రిష భారీ రెమ్యునరేషన్ అందుకుందని తెలుస్తుంది. కోలీవుడ్ లో సినిమాకు 2 నుంచి 3 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్న త్రిష టాలీవుడ్ కి వచ్చే సరికి రెమ్యునరేషన్ డబుల్ చేసినట్టు తెలుస్తుంది.
విశ్వంభర సినిమాకు 3 కోట్లకే కమిటైన త్రిష తెలుగులో తనకు వస్తున్న ఈ అవకాశాలను చూసి రేటు పెంచేసిందని అంటున్నారు. సినిమాకు 4 కోట్లు ఇస్తేనే అంటూ తన మేనేజర్ తో చెప్పిస్తుందని టాక్. సీనియర్ హీరోలతో జత కట్టేందుకు కొత్త హీరోయిన్స్ వెనకడుగు వేస్తున్న టైం లో వారితో కలిసి నటించేందుకు త్రిష లాంటి సీనియర్ హీరోయిన్స్ సై అనేస్తున్నారు. అందుకే వారికి ఇప్పటికీ డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. విశ్వంభరతో తెలుగులో కొద్దిపాటి గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన త్రిష ఆ సినిమాతో ఇక్కడ కూడా మళ్లీ తన హవా కొనసాగించాలని చూస్తుంది. 20 ఏళ్లు కాదు త్రిష దూకుడు చూస్తుంటే మరో ఐదు పదేళ్లు ఇదేలా సత్తా చాటేలా ఉందని చెప్పొచ్చు.