మ్యూజిక్ అంటే దక్షిణాదిలో ఈ ముగ్గురేనా?
దక్షిణాదిలో ఏ స్టార్ హీరో సినిమా మొదలైనా వినిపిస్తున్న పేర్లు అనిరుధ్, తమన్, దేవిశ్రీ ప్రసాద్. ఇక ఈ ముగ్గురిలో సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి టాలీవుడ్ టాప్ హీరోల వరకు జపిస్తున్న పేరు అనిరుధ్.
దక్షిణాదిలో ఏ స్టార్ హీరో సినిమా మొదలైనా వినిపిస్తున్న పేర్లు అనిరుధ్, తమన్, దేవిశ్రీ ప్రసాద్. ఇక ఈ ముగ్గురిలో సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి టాలీవుడ్ టాప్ హీరోల వరకు జపిస్తున్న పేరు అనిరుధ్. కమల్‌తో 'విక్రమ్', విజయ్‌తో 'బీస్ట్' 'లియో', రజనీతో 'జైలర్' వంటి బ్లాక్ బస్టర్లని అందించడంతో టాలీవుడ్ టాప్ స్టార్స్ కూడా అనిరుధ్ జపం చేస్తున్నారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్స్ కూడా అతనే కావాలి అంటుండటంతో అనిరుధ్‌కు భారీ డిమాండ్ పెరిగిపోయింది.
తన తరువాత లైన్‌లో ముందు వరుసలో నిలిచిన సంగీత దర్శకులు దేవి శ్రీప్రసాద్, తమన్. అయితే ఇప్పుడు వరుస మారింది. అనిరుధ్ తరువాత బిజిఎమ్స్ విషయంలో టాలీవుడ్‌లో ఏ హీరోని కదిలించినా తమన్ పేరే ప్రధానంగా వినిపిస్తోంది. ఆ తరువాతే దేవి శ్రీప్రసాద్ పేరు వినబడుతోంది. 'పుష్ప'తో జాతీయ స్థాయిలో దేవి పురస్కారం సొంతం చేసుకున్నా కానీ రేసులో మాత్రం తమన్ ముందు వరుసలో నిలుస్తూ స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్ అవుతున్నాడు.
ఇక తమిళంలో పాటు తెలుగులోనూ చిన్న చిన్నగా అనిరుధ్ డామినేషన్ మొదలవుతోంది. 'విక్రమ్', 'జైలర్'ల బిజిఎమ్స్ విన్న స్టార్స్ అంతా ఇప్పుడు అతనే కావాలని డిమాండ్ చేస్తున్నారట. అనిరుధ్ ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ 'దేవర', విజయ్ దేవరకొండ 'విడీ 12' చిత్రాలతో పాటు తమిళంలో 'ఇండియన్ 2', తలైవర్ 170, తలైవర్ 171 వంటి ప్రెస్టీజియస్ మూవీస్ ఉన్నాయి. తమిళంలో ఏ.ఆర్.రెహమాన్, జీ,.వి. ప్రకాష్ కుమార్, డి. ఇమాన్ వంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నా కానీ మెయిన్ డిమాండ్ మాత్రం అనిరుధ్‌కే ఉంది.
ఇక తెలుగులో మనం, టెంపర్, గోపాల గోపాల, సోగ్గాడే చిన్నినాయనా' వంటి సినిమాలతో మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న అనూప్, కొత్త బంగారు లోకం, లీడర్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'అఆ', శతమానం భవతి, మహానటి, వంటి ఎవర్ గ్రీన్ హిట్ ఆల్బమ్స్ అందించిన మిక్కీ.జె.మేయర్, భీమ్స్ సిసిరోలియో వంటి వాళ్లు ఉన్నా..వరుస హిట్‌లని తమ సంగీతంతో అందించినా తెలుగులో మాత్రం తమన్, దేవిల పేర్లే ప్రధానంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో చాలా మంది టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. వారిని పక్కన పెట్టి దక్షిణాది సినిమాలకు అనిరుధ్, తమన్, దేవిలనే ఎంచుకోవడం విడ్డూరంగా ఉందినే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్టార్స్ ఈ ముగ్గురిని మాత్రమే ప్రోత్సహించకుండా టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్‌కి అవకాశం ఇస్తే బాగుంటుందనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ వారం 'లియో'తో అనిరుధ్, భగవంత్ కేసరితో 'తమన్ పోటా పోటీగా పోటీపడబోతున్నారు. కానీ ఇప్పటి వరకు మాత్రం తమన్ ఈ పోటీలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు.