త్రిప్తి.. తృప్తి.. సంతృప్తి..!

అలాంటి వారిలో కచ్చితంగా బాలీవుడ్ అందాల భామ త్రిప్తి డిమ్రి ఉంటుంది యానిమల్ సినిమాలో ఛాన్స్ ఆమె ఫేట్ మార్చేసిందని చెప్పొచ్చు.

Update: 2024-10-17 09:30 GMT

గ్లామర్ ఫీల్డ్ లో ఎన్నాళ్ల నుంచి పనిచేస్తున్నాం అన్నది కాదు ఎప్పుడు క్రేజ్ తెచ్చుకున్నాం అన్నది ఇంపార్టెంట్. అలాంటి విషయాలు తమకు రావాల్సిన గుర్తింపు లేట్ గా వచ్చిన వారికి బాగా అర్థమవుతుంది. అలాంటి వారిలో కచ్చితంగా బాలీవుడ్ అందాల భామ త్రిప్తి డిమ్రి ఉంటుంది. యానిమల్ సినిమాలో ఛాన్స్ ఆమె ఫేట్ మార్చేసిందని చెప్పొచ్చు. అంతకుముందు కూడా త్రిప్తి సినిమాలు, వెబ్ సీరీస్ లు చేసింది కానీ ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. కానీ ఎప్పుడైతే యానిమల్ రిలీజైందో బీ టౌన్ ఆడియన్స్ అంతా త్రిప్తి పేరునే జంపించేలా చేసింది.


ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక కన్నా త్రిప్తికే ఎక్కువ పాపులారిటీ వచ్చిందని చెప్పొచ్చు. ఇక ఒక్కసారి లైం లైట్ లోకి వచ్చాక ఆఫర్లు వాటంతట అవే వచ్చేస్తాయి. అందులో భాగంగానే త్రిప్తి వరుస అవకాశాలు అందుకుంటుంది. యానిమల్ తర్వాత తన కెరీర్ పరంగా వేగాన్ని పెంచుకున్న త్రిప్తి సినిమాల సక్సెస్ రేటు ఎలా ఉన్నా తన పేరు వినిపించేలా చేసుకుంటుంది.


ఇక సినిమా ఫలితాలు ఎలా ఉన్నా వాటితో పాటు సోషల్ మీడియా ఫోటో షూట్స్ తో కూడా త్రిప్తి ఇంప్రెస్ చేస్తుంది. తన మార్క్ గ్లామర్ షో చేస్తూ త్రిప్తి తన ఫాలోవర్స్ ని సంతృప్తి చెందేలా చేస్తుంది. లేటెస్ట్ గా అద్దం ముందు చీరందంతో అమ్మడు చేస్తున్న గ్లామర్ షో ఆడియన్స్ కు పిచ్చెక్కిస్తుందంటే నమ్మాల్సిందే. తన చూపులతో త్రిప్తి చేస్తున్న క్రేజీ స్కిన్ షో కుర్రాళ్ల మతులు పోగౌతుంది.


సినిమాల లెక్క ఎలా ఉన్నా అమ్మడికి వచ్చిన ఈ ఫాలోయింగ్ కి ఇలా ఫోటో షూట్స్ చేసినా చాలు అనిపించేలా కనిపిస్తుంది. బాలీవుడ్ లో సినిమా వెంట సినిమా చేస్తున్న త్రిప్తి సౌత్ సినిమా ఆఫర్లు వస్తున్నా ఎందుకో అమ్మడు ఆలోచిస్తుందని తెలుస్తుంది. ముఖ్యంగా తెలుగు మేకర్స్ త్రిప్తిని తెలుగులో నటింప చేయాలని ఉత్సాహంగా ఉన్నారు. మరి అది ఏ సినిమా అవుతుంది అన్నది చూడాలి. ఏది ఏమైనా త్రిప్తి ఇదివరకు కెరీర్ కన్నా యానిమల్ తర్వాత ఆమె ఉత్సాహంతో పనిచేస్తుంది. ఈ టైం లో టాలీవుడ్ ఆఫర్ కూడా వస్తే త్రిప్తి రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది.

Tags:    

Similar News