ఆ సౌత్ స్టార్ తో యానిమల్ బ్యూటీ!
`యానిమల్` తో ఫేమస్ అయిన త్రీప్తి డిమ్రీ కి సౌత్ లో ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు.
`యానిమల్` తో ఫేమస్ అయిన త్రీప్తి డిమ్రీ కి సౌత్ లో ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఒక్క సినిమాతోనే సౌత్ ఆడియన్స్ ని ఊపేసింది. ఇంటిమేట్ సన్నివేశాల్లో అమ్మడు చెలరేగిన వైనంతోనే ఇది సాధ్యమైంది. ఈ సక్సెస్ తో బాలీవుడ్ లో బిజీ బ్యూటీగా మారిపోయింది. అంతవరకూ అవకాశాలే రానీ బ్యూటీ ఒక్కసారిగా అడ్వాన్సులు అందుకోవడంలో జోరు చూపించింది. ఈనేపథ్యంలో అమ్మడు మరో కొత్త ప్రాజెక్ట్ కి సైన్ చేసింది. అయితే అది సౌత్ హీరో సరసన కావడం మరింత ఆసక్తికరంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే కోలీవుడ్ స్టార్ ధనుష్ కథానాయకుడిగా ఆనంద్ ఎల్ రాయ్ ఓ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రకటించి ఏడాది అవుతున్నా? ఇంతవరకూ సెట్స్ కి వెళ్లలేదు. ధనుష్ వేర్వేరు సినిమాలతో బిజీగా ఉండటంతో అది సాధ్యపడలేదు. ఈనేపథ్యంలో ఏడాది అక్టోబర్ లో ప్రారంభించాలని దర్శకుడు సంకల్పించారు. దీంతో కొన్ని నెలలుగా ఈ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నారు.
`తేరే ఇష్క్ మే అనేది ఈ సినిమా టైటిల్ గా ఇప్పటికే ఖరారు చేసారు. ఇది కూడా విషాధంతో కూడిన ప్రేమ కథ అని సమాచారం. లవ్ స్టోరీలు రూపొందించడంలో ఆనంద్ ఎల్ స్పెషలిస్ట్. తనదైన మార్క్ ఎమోషన్ తో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాడు. దీంతో మరోసారి అదే పాయింట్ ని బేస్ చేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే కాంబినేషన్ లో తెరకెక్కిన `రాంఝానా` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.
30 కోట్ల బడ్జెట్ లోనే 100 కోట్ల వసూళ్ల సినిమాగా రికార్డు సృష్టించింది. దీంతో ఆనంద్ ఎల్ రాయ్ మరోసారి అదే రకమైన ఎమోషన్ తో మూందుకెళ్తున్నారు. ఇందులో హీరోయిన్ గా త్రిప్తీ డిమ్రీని ఎంపిక చేసినట్లు సమాచారం. యానిమల్ ఆమె పెర్పార్మెనస్ చూసి ఆనంద్ ఛాన్స్ ఇచ్చారుట. దీంతోఒ ఈ ప్రాజెక్ట్ కి త్రిప్తీ డిమ్రీ ఎంట్రీ కూడా కీలకమని తెలుస్తోంది.