నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్న యానిమ‌ల్ బ్యూటీ

`యానిమ‌ల్` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని అటుపై వ‌రుస చిత్రాల‌కు సంత‌కాలు చేసిన ట్రిప్తి దిమ్రీ పారితోషికం అమాంతం పెంచేసింద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

Update: 2024-09-17 21:30 GMT
నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్న యానిమ‌ల్ బ్యూటీ
  • whatsapp icon

`యానిమ‌ల్` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని అటుపై వ‌రుస చిత్రాల‌కు సంత‌కాలు చేసిన ట్రిప్తి దిమ్రీ పారితోషికం అమాంతం పెంచేసింద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఇటీవ‌లే `బాడ్ న్యూజ్`తో మ‌రో విజ‌యాన్ని ఖాతాలో వేసుకుంది. దీంతో ట్రిప్తికి ఎదురే లేకుండా పోయిందని నిర్మాత‌ల్లో గుస‌గుస వినిపిస్తోంది. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో అత్యంత బిజీ నటీమణులలో ఒకరిగా మారిన ట్రిప్తీ ఇప్పుడు తన పారితోషికాన్ని రూ.10కోట్ల‌కు పెంచిన‌ట్టు తెలుస్తోంది.

బ్యాడ్ న్యూజ్ కోసం రూ. 6 కోట్లు అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు అమాంతం 4 కోట్లు పెంచి మొత్తంగా 10కోట్లు డిమాండ్ చేస్తోంది. ట్రిప్తీ ఇంటి ముందు క్యూ అంత‌కంత‌కు పెరుగుతోంది. దీంతో డిమాండ్‌కి త‌గ్గ‌ట్టే పారితోషికాన్ని అమాంతం పెంచేసింద‌ని తెలిసింది. గ్లామ‌ర్ షో ప‌రంగా ఎలాంటి అభ్యంత‌రాలు లేక‌పోవ‌డంతో ట్రిప్తీ చుట్టూ నిర్మాత‌లు క్యూ క‌డుతున్నార‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది.

ప్ర‌స్తుత లైన‌ప్ చూస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ట్రిప్తీ ఇటీవ‌ల వ‌రుస‌గా సీక్వెల్ సినిమాల్లో న‌టిస్తోంది. భూల్ భూలైయా 3, ధడక్ 2 ఇప్పటికే లైన్‌లో ఉన్నాయి. బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రాంఛైజీ నుంచి `ఆషిఖి 3`లోను న‌టిస్తోంద‌ని క‌థ‌నాలొచ్చాయి. `విక్కీ విద్యా కా వో వాలా వీడియో` ఇప్ప‌టికే క‌న్ఫామ్ అయింది. ఇత‌ర‌ ప్రాజెక్ట్‌లు చర్చల ద‌శ‌లో ఉన్నాయి. ట్రిప్తి ప్ర‌స్తుతం అడ్వాన్సుల రూపంలో భారీ మొత్తాల‌ను అందుకుంది. వాటిని రియ‌ల్ వెంచ‌ర్ల‌లో పెట్టుబ‌డులుగా పెడుతోంది. ఇటీవ‌లే బాంద్రాలో ఖ‌రీదైన అపార్ట్ మెంట్ ని కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News