అదుపు తప్పిన ట్రిప్తి ఎక్స్పోజింగ్!
ఇకపై యానిమల్ బ్యూటీ కెరీర్ కూడా అలాంటి డైలమాలో పడిపోతుందని ఊహిస్తున్నారు.
గ్లామర్ హద్దులు చెరిపేసి చెలరేగిపోవడం కొందరికి అలవాటు. బాలీవుడ్ లో మల్లికా శరావత్, రాఖీ సావంత్, మలైకా అరోరా లాంటి భామలు తొలి నుంచి గ్లామరస్ డాళ్స్ గా ముద్ర పడిపోవడంతో అటుపై ఈ భామల కెరీర్ ఏమైందో తెలిసిందే. చివరికి ఐటమ్ నంబర్లు చేసుకుంటూ ఐటమ్ క్వీన్స్ గా ముద్ర పడిపోయింది. ఆ తరహా అవకాశాలతోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఒకసారి ఐటమ్ నంబర్ బ్రాండ్ పడిపోతే అటుపై సాంప్రదాయ హీరోయిన్ గా నటించాలని అనుకున్నా అవకాశాలిచ్చేవాళ్లే ఉండరు. యూత్ లో ఇమేజ్ పరంగా చాలా చిక్కుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇమేజ్ కి తగ్గట్టే ఎక్స్ పోజింగ్ తప్పనిసరి అవుతుంది.
ఇకపై యానిమల్ బ్యూటీ కెరీర్ కూడా అలాంటి డైలమాలో పడిపోతుందని ఊహిస్తున్నారు. లైలా మజ్ను, బుల్బుల్, ఖలా వంటి చిత్రాలలో పెర్ఫామర్ గా కనిపించిన ట్రిప్తి, యానిమల్ లో పూర్తిగా గ్లామర్ డాళ్ పాత్రలో కనిపించింది. యానిమల్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ కావడం.. రణబీర్ లాంటి అగ్ర కథానాయకుడి సరసన నటించడంతో తనకు అవసరానికి మించిన గుర్తింపు దక్కింది. అయితే ఇప్పుడు అదే తనకు మైనస్ గా మారినట్టు కనిపిస్తోంది. ట్రిప్తి తాజా చిత్రం బ్యాడ్ న్యూజ్ తనకు ఇలాంటి ఒక బ్యాడ్ ఇమేజ్ ని సృష్ఠిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్లో ట్రిప్తి ఎంతో హాట్ గా కనిపించింది. హద్దులు చెరిపేసి గ్లామరస్ యాక్ట్‌తో రెచ్చిపోయింది.
ఇంతకుముందే విడుదలైన `జానమ్` సాంగ్ లో విక్కీ కౌశల్‌తో రొమాన్స్‌లో చెలరేగిపోయిన ట్రిప్తి, అతడితో బెడ్ రూమ్ సన్నివేశాల్లో హద్దులు చెరిపేసింది. ఘాటైన అదర చుంబనాలతో మతులు చెడగొట్టింది. నిజానికి ఇది తనకు ఏ తరహా ఇమేజ్ ని క్రియేట్ చేస్తుంది? అంటే.. మల్లికా శెరావత్ కెరీర్ ముగింపులో ఐటమ్ భామగా మాత్రమే అవకాశాలు అందుకుంది. అదే తరహాలు తాను కూడా మరో మల్లిక అవుతుందనే సందేహాల్ని కలిగిస్తోంది. ట్రిప్తికి ఇకపై ఐటమ్ లలో మాత్రమే అవకాశాలు పెరిగి, మెయిన్ లీడ్ లో ఛాన్సులు దక్కకపోవచ్చని కూడా అభిమానులు సందేహాల్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే వీటన్నిటినీ దాటుకుని ట్రిప్తి తన కెరీర్ ని సవ్యమైన మార్గంలో నడిపిస్తుందేమో చూడాలి. ఆనంద్ తివారీ దర్శకత్వంలో ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన `బ్యాడ్ న్యూజ్` చిత్రంలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించారు. బ్యాడ్ న్యూజ్ నిజ సంఘటనల ఆధారంగా రూపొందింది. త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది.