త్రివిక్రమ్ - సునీల్.. 30 రూపాయల అనుభవం

అలాగే త్రివిక్రమ్ సినిమాల ద్వారానే సునీల్ స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పొచ్చు.

Update: 2024-10-28 05:23 GMT

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ లలో ఒకడిగా ఉన్నారు. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులని మెప్పిస్తున్నారు. నెక్స్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. ఇక ప్రస్తుతం నటుడిగా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న సునీల్, డైరెక్టర్ త్రివిక్రమ్ రూమ్ మెట్స్ అనే సంగతి చాలా మందికి తెలుసు. ఈ విషయాన్ని వారిద్దరూ పలు సందర్భాలలో చెప్పారు. అలాగే త్రివిక్రమ్ సినిమాల ద్వారానే సునీల్ స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పొచ్చు.

ఇప్పటికి త్రివిక్రమ్ సినిమాలలో సునీల్ కచ్చితంగా చిన్న క్యారెక్టర్ లో అయిన కనిపిస్తాడు. వీరిద్దరూ కలిసి రూమ్ లో ఉన్న సమయంలో ఎదురయ్యే కష్టాలని పలు సందర్భాలలో సునీల్ పంచుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ‘లక్కీ భాస్కర్’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. లక్కీ భాస్కర్ మూవీ డబ్బు నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కావడంతో త్రివిక్రమ్ తన మనీ కష్టాల గురించి ఈ ఈవెంట్ లో పంచుకున్నారు.

సునీల్, నేను లక్ డీ కపూల్ లో రూమ్ లో ఉన్న సమయంలో ఒక సంఘటన జరిగింది. చేతిలో 30 రూపాయిలు ఉన్న టైంలో హౌస్ ఓనర్ రూమ్ ఖాళీ చేయమని చెప్పారు. దీంతో నెక్స్ట్ తక్కువ మనీతో ఎలా అడ్జస్ట్ అవ్వాలా అని సునీల్ లెక్కలు వేసుకుంటున్నాడు. అయితే ఆ రోజులల్లో కోక్ టిన్ లు కొత్తగా మార్కెట్ లోకి వచ్చేసాయి. నేను 28 రూపాయిలు పెట్టి కోక్ టిన్ కొనేసాను. సునీల్ టెన్షన్ పడుతూ నెక్స్ట్ ఆ 30 రూపాయిలతో ఎలా మూడు రోజులు అడ్జస్ట్ అవ్వాలా అని లెక్కలు వేస్తే నువ్వొక రోజులోనే ఖర్చు చేసావ్ అని అన్నాడు.

మూడు రోజుల తర్వాత ఎలా అని ఆలోచించే బదులు ఈ నైట్ నుంచే రేపు ఎలా బ్రతకాలో ఆలోచిద్దాం అని సునీల్ కి చెప్పానని త్రివిక్రమ్ శ్రీనివాస్ తన లైఫ్ లో మనీ కష్టాలు గురించి ఈవెంట్ లో పంచుకున్నారు. గతంలో సునీల్ కూడా మీలో ఎవరు కోటీశ్వరుడు ఈవెంట్ లో మెగాస్టార్ తో ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు.

త్రివిక్రమ్, సునీల్ 30 రూపాయిల అనుభవం నుంచి చాలా మంది జీవిత పాఠాలు నేర్చుకోవచ్చనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఆ పరిస్థితిలో సినీ ప్రయాణం స్టార్ట్ చేసి ఈ రోజు ఇండస్ట్రీలో గురూజీ అంటూ పిలిచే స్థాయికి త్రివిక్రమ్ చేరుకున్నాడు. ఇక సునీల్ పాన్ ఇండియా స్టార్ యాక్టర్ గా ప్రూవ్ చేసుకొని అన్ని భాషలలో సినిమాలు చేసే పొజిషన్ కి వచ్చాడు.

Tags:    

Similar News