ఇచ్చిన మాట తప్పిన త్రివిక్రమ్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు.

Update: 2023-11-27 04:40 GMT

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు. వరుస సక్సెస్ లతో మంచి జోరు మీద ఉన్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక మొదట రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరియర్ స్టార్ట్ చేశారు.

త్రివిక్రమ్, యాక్టర్ సునీల్ మంచి ఫ్రెండ్స్ అనే సంగతి అందరికి తెలిసిందే. ఇద్దరు కలిసి ఒకేసారి కెరియర్ స్టార్ట్ చేశారు. త్రివిక్రమ్ చేసే ప్రతి సినిమాలో కూడా సునీల్ కోసం మంచి కామెడీ రోల్ రాస్తూ ఉండేవారు. ఇలాగే అతను స్టార్ కమెడియన్ అయ్యారు. వందల సినిమాలు చేశారు. ఒకానొక దశలో కమెడియన్ గా సునీల్ బ్రహ్మానందం ఇమేజ్ ని దాటిపోయారు.

తరువాత అందాల రాముడు, మర్యాద రామన్న సినిమాలతో సునీల్ హీరోగా మారాడు. అక్కడి నుంచి కొంతకాలం వరుసగా హీరోగా కామెడీ, కమర్షియల్ మూవీస్ చేస్తూ వచ్చారు. అయితే హీరోగా కెరియర్ లో ఆశించిన స్థాయిలో సక్సెస్ లు రాలేదు. దీంతో మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. సునీల్ హీరోగా ఉన్న సమయంలోనే త్రివిక్రమ్ అతనికి మాటిచ్చారు. హీరోగా పెట్టి బంతి అనే సినిమా చేస్తానని చెప్పారు.

అయితే త్రివిక్రమ్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీ అయిపోవడంతో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో సునీల్ హీరోగా బంతి మూవీ పడి ఉంటే మరికొంత కాలం హీరోగా అతని కెరియర్ కొనసాగేది అనే టాక్ వినిపిస్తోంది. అయితే హీరోగా ఫెయిల్ అయ్యి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారే ప్రయత్నంలో ఉన్న సునీల్ కి మరల త్రివిక్రమ్ తన సినిమాలో అవకాశం ఇచ్చారు.

అలా చిన్న చిన్న పాత్రలు చేస్తూ పుష్ప సినిమాలో ఏకంగా మెయిన్ విలన్ రోల్ చేసి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగుకి మాత్రమే పరిమితం కాకుండా తమిళ్, మలయాళీ, కన్నడ భాషలలో కూడా సునీల్ ఫుల్ బిజీగా ఉన్నాడు. దర్శకులు సునీల్ కోసం డిఫరెంట్ పాత్రలని సృష్టిస్తూ ఆయనని తమ సినిమాలలో ఎంపిక చేసుకుంటున్నారు. బంతి మూవీ లేకపోయిన నటుడిగా సునీల్ కి ఇప్పుడు కావాల్సినంత డిమాండ్ ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News