సామ్‌పై అసహ్యకరమైన ట్రోలింగ్
సమంత ప్రస్తుతం మలేషియాలోని లంకావిలో అందమైన అడవులు, కొండలు పచ్చదనం జలపాతాల్లో విహరిస్తున్నారు.
మయోసైటిస్ నుంచి కోలుకుని నెమ్మదిగా సినిమాలతో బిజీ అయ్యేందుకు సమంత ప్రయత్నిస్తోంది. త్వరలో సిటాడెల్ ప్రమోషన్స్ సహా కొత్త సినిమాల ప్రకటనలను తననుంచి అభిమానులు ఆశిస్తున్నారు. ఇంతలోనే విరామంలో సమంత విహారయాత్ర హాట్ టాపిక్ గా మారింది. సమంత ప్రస్తుతం మలేషియాలోని లంకావిలో అందమైన అడవులు, కొండలు పచ్చదనం జలపాతాల్లో విహరిస్తున్నారు.
ఇంతకుముందే అక్కడ టూరిస్ట్ స్పాట్ నుంచి కొన్ని అందమైన ఫోటోలను సమంత షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. వీటిలో సమంత గోధుమ రంగు బికినీ ధరించి స్వచ్ఛమైన జలకాల్లో సరిగంగ స్నానాలాడుతున్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. నేచుర్ ఆస్వాధనలో భాగంగా సమంత పూర్తి స్వేచ్ఛగా విహరిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తున్నారు.
అయితే వీటికి పాజిటివ్ స్పందనలే కాదు.. దారుణమైన ట్రోల్స్ ఎదురవుతున్నాయి. సమంత ప్రతిసారీ తన సినిమాల ప్రమోషన్స్ సమయంలో మయోసైటిస్ గురించి ప్రస్థావిస్తూ సింపథీని కొట్టేస్తోందని, అది సినిమాల ప్రమోషన్స్ కి సహకరిస్తోందని కొందరు ట్రోలర్స్ దుయ్యబట్టారు. తాజా బికినీ ట్రీట్ చూశాక అసలు సమంతకు ఆరోగ్య సమస్య ఉందా లేదా? అదంతా కేవలం ప్రచారం కోసం ఆర్భాటమా? అంటూ కొందరు ఆరాలు తీసారు. మిగతా సమయాల్లో అంతా బాగానే ఉంది కానీ అనారోగ్యం లక్షణాలు ఆమె సినిమా విడుదలకు ముందు మాత్రమే కనిపిస్తాయి. ముఖ్యంగా సినిమా ప్రమోషన్ల సమయంలో, తనను తాను బాధితురాలిగా చిత్రీకరించడం సానుభూతి కోసం వ్యూహాత్మకంగా తన ఆరోగ్య సమస్యలను తెరపైకి తెస్తోందని చాలా మంది నెటిజనులు ఆరోపించారు.
అయితే మయోసైటిస్ తో సమంత పోరాటం అబద్ధం కాదన్నది అందరికీ తెలుసు. అనారోగ్య సమస్య తలెత్తకుండా తన కెరీర్ ని పణంగా పెట్టి ఇంతగా దిగజారిపోదు. అయితే ఇప్పుడు బికినీలో వేవ్స్ క్రియేట్ చేయడానికి కారణం తాను ఇంకా నటిగా ఫుల్ ఫిట్ గా ఉన్నానని చెప్పడమే.. కానీ దానిని అర్థం చేసుకోకుండా అనవసరంగా ఇష్టానుసారం వ్యాఖ్యానించడం సరికాదని కొందరు సూచిస్తున్నారు. ఒకరి వ్యక్తిగత జీవితం, వారి జీవనంపై వ్యాఖ్యానించే హక్కు ఎవరికీ లేదు.