ట్రోలింగ్: రాజకీయాలు తెలియవు సరే కానీ ఊర్వశీ..!
టుమారో రిలీజ్.. జులై 28 అనే హ్యాష్ ట్యాగ్ ను కాపీ పేస్ట్ చేసేప్పుడు అలానే వదిలేయడంతో అది తప్పుగా అన్వయించబడింది.
పవన్ కల్యాణ్ మేనియా లో చిక్కుకుంది ఊర్వశి రౌతేలా. బ్రో పవన్ మాయలో తరించిపోతోంది ఈ హిందీ బ్యూటీ. బ్రో సినిమా లో ఒక ప్రత్యేక నంబర్ లో కనిపించిన ఊర్వశి ఇంతకుముందు ఎరక్కపోయి ఏపీ రాజకీయాల్లో ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ ఏపీ సీఎం! అంటూ తెలిసో తెలియకో సోషల్ మీడియాల్లో వ్యాఖ్యానించింది. అయితే దీని పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ సాగింది. అయినదానికి కానిదానికి సోషల్ మీడియా లనే ప్రామాణికంగా భావించే యూత్ ఊర్వశి పై ఒక రేంజు లో విరుచుకుపడ్డారు.
బ్రో ప్రీరిలీజ్ వేడుక పూర్తయిన తర్వాత సోషల్ మీడియాల్లో ఊహించని వ్యాఖ్యలు చేసిన ఊర్వశి అడ్డంగా బుక్కయింది. పవన్ ని తెలిసే ముఖ్యమంత్రిని చేసేశావా? అంటూ చాలా మంది దునుమాడారు. అయితే ఊర్వశి పాత ట్వీట్ ని తొలగించకుండానే కొత్త ట్వీట్ వేసి మరోసారి అభాసుపాలైంది.
ఈసారి ట్వీట్ లో ఏపీ సీఎం అనే పదాల ను తొలగించిన ఊర్వశి అదే మ్యాటర్ ని కాపీ పేస్ట్ చేసింది. అయితే ఇందులో మరిన్ని తప్పులు దొర్లడంతో మరోసారి నెటిజనుల దృష్టిలో పడింది. టుమారో రిలీజ్.. జులై 28 అనే హ్యాష్ ట్యాగ్ ను కాపీ పేస్ట్ చేసేప్పుడు అలానే వదిలేయడంతో అది తప్పుగా అన్వయించబడింది. టుమారో రిలీజ్ అంటూ తప్పుడు ప్రచారం చేసింది ఊర్వశి. నిజానికి ఈరోజు బ్రో సినిమా విడుదలైంది.
ఊర్వశి బ్రో సినిమా పై ట్వీట్ చేసేప్పుడు అస్సలు జాగ్రత్త తీసుకోకుండా ఇలా చేసింది. పవన్ కి ఉన్న మేనియా గురించి ఫ్యానిజం గురించి తెలిసీ ఇదంతా చేసిందా.. ? లేక తెలిసీ తెలియక అలా చేసిందా? అన్న డౌట్లు అందరి లో ఉన్నాయి. రాజకీయాల్లో అవగాహన లేదు సరే కనీసం సినిమా ప్రపంచానికి చెందిన నువ్వు కనీసం రిలీజ్ డేట్ గురించి అయినా సరిగా చెప్పవా? అంటూ ట్రోలింగ్ సాగుతోంది.
నిజానికి బ్రో సినిమా లో కేవలం కొన్ని నిమిషాల పాటు కనిపించే ప్రత్యేక గీతం లో మాత్రమే ఊర్వశి రౌతేలా నర్తించింది. అంతకుమించి ఈ సినిమా తో తనకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ప్రమోషన్ కార్యక్రమాల కు సహకరిస్తూ తనదైన మంచితనాన్ని చాటుకుంటోంది. అయినా నెటిజనులు ఏదో ఒక కొంటె షాక్ చూపిస్తూ ఊర్వశిని ట్రోల్ చేసేందుకు ప్రయత్నించడం ఏమిటో అర్థం కానిది!