నయన్ మైనస్ లు త్రిషకి ప్లస్ లు!
నయనతారతో సినిమా అంటే వ్యవహరం ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.
నయనతారతో సినిమా అంటే వ్యవహరం ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. సైన్ చేయడానికి ముందు కొన్నినియమ నిబంధనలుంటాయి. వాటికి దర్శక-నిర్మాతలు ఒకే అయితేనే సైన్ చేస్తుంది. లేదంటే ఎంత పారితోషికం ఇస్తామన్నిఆ రూల్ మాత్రం దాటదు. నటన పరంగా వందశాతం ఎఫెర్ట్ పెట్టి పనిచేస్తుంది. తెరపై ఎంత అందంగానైనా..సన్నివేశానికి తగ్గట్టు నటిస్తుంది. ఆ విషయంలో ఎక్కడా రాజీ పడదు. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ వచ్చిన చిక్కల్లా ప్రచారంకి హాజరు కాదు.
షూటింగ్ వరకే నా బాధ్యత అంటుంది. రిలీజ్ తర్వాత నాకేం సబంధం లేదంటుంది. సౌత్ లో కొంత కాలంగా నెంబర్ వన్ గా కనిపిస్తోన్న నేపథ్యంలో అత్యధిక పారితోషికం తీసుకుంటన్న భామగానూ పేరుంది. ఆమె అడిగినంత ఇవ్వాల్సిందేనన్న విమర్శ కూడా ఉంది. ఇవి నయనతారలో ఉన్న మైనస్ లు. అయితే ఇప్పుడా మైనస్ లు త్రిష ప్లస్ లు గామార్చుకుంటుందా? తనలో ఆ స్ట్రాటజీనే అమ్మడినిప్పుడు బిజీ నాయికగా మలుస్తున్నాయా? అంటే సన్నివశం అలాగే కనిపిస్తుంది. పొన్నియన్ సెల్వన్ విజయంతో త్రిష మళ్లీ ఉప్పెనలా దూసుకొచ్చింది.
వరుస అవకాశాలతో బిజీ నాయికగా మారింది.ప్రస్తుతం అమ్మడి చేతిలో పది సినిమాలున్నాయి. ఇటీవలే `థగ్ లైప్` సినిమాకి 12 కోట్లు పారితోషికం అందుకుంది. `విశ్వంభర` చిత్రానికి గానూ 10 కోట్లు ఛార్జ్ చేసింది. హీరోయిన్ గా ఫాం లో ఉన్న సమయంలో ఈ రేంజ్ పారితోషికం ఏనాడు అందుకోలేదు. అంతగా డిమాండ్ చేసింది కూడా లేదు. త్రిష అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు కూడా వెనక్కి తగ్గడం లేదు. నిర్మాతల కండీషన్లు అన్నింటికీ ఒకే అనడంతో ఇది సాధ్యమవుతుంది.
సినిమా ప్రచారంలో త్రిష ఎంతో యాక్టివ్ గా పాల్గొంటుంది. ప్లైట్ టికెట్ వేయాలేగానీ ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తుంది. ఆమెతో అదనపు బారం కూడా ఉండదు. ఇలా త్రిష-నయనతారల మధ్య కొంత వ్యత్యాసం ఉంది. ఆ కారణంగానే నయనతార ఫాంలో ఉన్నా త్రిష సెకెండ్ ఇన్నింగ్స్ లో బిజీగా కనిపిస్తుందని తెలుస్తుంది.